పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

తరువాత స్వదేశం చేరుకున్న ఆయన తిరిగి జాతీయోద్యమ కార్యక్రమాలకు పూర్తిగా అంకితమయ్యారు.1928లో గుజరాత్‌ రాష్ట్రంలో ఆరంభమైన బార్డోలి తాలూకా రైతులు సత్యాగ్రహ ఉద్యమంలో అబిద్‌ అలీ క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో సాగిన ప్రతి ప్రభుత్వవ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నఆయన ప్రతిసారి పోలీసుల దాడులకు, జైలు శిక్షలకు గురయ్యారు.

అబిద్‌ అలీ మతతత్వరాజకీయలను నిరసించి విభజన వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మతం ఆధారంగా దేశాన్నివిభజించటం వలన ప్రజలకు ఏమాత్రం ప్రమోజనం ఉండదని స్పష్టంగా ప్రకటించారు. ఆ కారణంగా పోలీసుల దాడులనే కాదు ముస్లిం లీగ్ కార్యకర్తల హింసాకాండను కూడాచవిచూడల్సి వచ్చింది. భారత దేశానికి స్వాతంత్య్రం లభించింది. దశాబ్దాలుగా సాగించిన పోరాటం విజయవంతం అయ్యాక కార్మికులను సంఘటితం చేసూ,కార్మికోద్యమం వైపు గా ఆయన

సాగారు. ఆ క్రమంలో ఇండియన్‌ నేషనల్‌ ట్రేడ్‌ యూనియన్‌ క్రాంగెస్‌ (INTUC)

వ్యవస్ధాపక ఉపాద్యక్షులయ్యారు.ఈ సందర్బంగా INTUC ప్రగతి, పటిష్ట్తకు అహర్నిశలు పనిచేశారు. 1946లో భారతదేశంలోని కార్మికుల, కార్మిక సంఘాల ప్రతినిధిగా ఆయన అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశాలకు హజరయ్యారు.

1948 సంవత్సరంలో అబిద్‌ అలీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎంపికయ్యారు. ఈ పదవిలో 1952 వరకు ఉన్నారు. 1952 నుండి 54 వరకు ఆయన రాజ్యసభ సబ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత కంద్రా ప్రబుత్వంలో కార్మిక శాఖామాత్యులుగా కూడా ఆయన పనిచేశారు.

అబిద్‌ అలీ కార్మిక, రాజకీయనాయుకుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా రాణించారు. కార్మికుల జీవితాలను, కార్మికోద్యమాన్నివివరిస్తూ ఆయన పలు గ్రంథాలు రాశారు. కమ్యూనిస్టుల పట్ల తనకు గల భావాలను వ్యక్తంచేస్తూ, ఆంగ్లంలో ఆయన రాసిన INDIAN COMMUNISTS EXPOSED, INDIAN COMMUNISTS గ్రంథాలు ఆబనాటి కార్మిక లోకంలో సంచలనానికి కారణమయ్యాయి.

ఒకనాడు ఇల్లు గడవటం కోసం అతి సామాన్య మిల్లు కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించి ఇటు జాతీయోద్యమకారునిగా అటు కార్మిక సంఘాల వ్యవస్థాపకుడిగా, జాతీయ-అంతర్జాతీయ స్ధాయిలలో కార్మికజన హితైషిగా ఖ్యాతి గడించి, ఆ క్రమంలో ఆ కార్మిక శాఖా మంత్రిగా బాధ్యా తలను కూడా చేపట్టి ప్రముఖ నాయకునిగా గుణుతికెక్కిన అబిద్‌ అలీ 1973 న్‌ 27న తన ప్రియజనుల మధ్యన కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌