పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

187

85. అబిద్‌ అలీ

(1899-1973)

జాతీయోద్యమం ద్వారా ఉద్యమకారునిగా అక్షరాభ్యాసం చేసి ఆ తరువాత పలు ప్రజా జీవనరంగాలలో తీవ్రంగా కృషిసల్పి ఆయా రంగాలలో ప్రముఖులుగా ఖ్యాతిగాంచిన పలువురు ప్రసిద్దుల సరసన స్థానం పొందిన యోధులు అబిద్‌ అలీ.

1899 సంవత్సరంలో కచ్‌కు చెందిన అతి సామాన్య వ్యాపారి జఫర్‌ భాయి ఇంట జన్మించారు. కుటుంబ భారాన్ని మోయలేక ఇక్కట్లు పడుతున్న తండ్రిని ఆదుకోడానికి అబిద్‌ అలీ 14 ఏండ్ల వయస్సులో మిల్లు కార్మికులయ్యారు. కుటుంబం గడవటానికి కార్మికుడిగా లభిస్తున్నఆదాయం చాలకపోవటంతో పలు ఇతర పనులు కూడా చేశారు.

నిరంతర శ్రమ వలన ఆర్థికంగా కాస్త ప్రశాంతత లభిస్తున్న సమయంలో గాంధీజీ పిలుపుకుస్పందించి ఖిలాఫత్ - స హా యనిరాకరణ ఉద్యమంలో ఆయన భాగస్వాములయ్యారు. ఆ విధంగా 1921లో జాతీయోద్యమంలో ప్రవేశించిన అబిద్‌ ఆలీ జీవిత చరమాంకం వరకు ప్రజాసేవలో గడిపారు. ఖిలాఫత్‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ నిబద్దత గల కార్యదక్షుడిగా అందరి మన్ననలు పొందారు. ఆ క్రమంలో పలుమార్లు జైలు శిక్షలకు గురయ్యారు. కొంతకాలం మలయా వెళ్ళిన ఆయన ఆక్కడ కూడ బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో బహిష్కారానికి గురయ్యారు. ఆ

చిరస్మరణీయులు