పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

సిద్ధాంతాలతో మమేకమైన ఆయన విప్లవ సంఘాలతో కూడ సంబంధాలు ఏర్పరచు కున్నారు. ఒకవైపున తన ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములు చేస్తూ మరోవైపు న బలూచీ ప్రజల ప్రత్యే క వెతలను,బ్రిటిష్‌ పాలకవర్గాల దోపిడీని వివరించేందుకు ఆయన జాతీయకాంగ్రెస్‌ సమావేశాలను వేదిక చేసుకున్నారు. ఆయన ప్రసంగాల ధాటికి తట్టుకోలేకపోయిన ప్రభుత్వం ఆయనను, ఆయన సోదరులను కూడా జైళ్ళ పాల్జేసింది. ఆ విధంగా జైలు శిక్షల అనుభవం ఆరంభించిన ఆయన జైలు జీవితం అటుబ్రిటిష్‌ ఇండియాలో, ఇటు పాకిస్థాన్‌లో మొత్తం మీద 15 ఏండ్లు సాగింది.

జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు అబ్దుస్‌ సమద్‌ యుద్ధ వ్యతిరేక పోరాటంలో పాల్గొని, యుద్ధ వ్యతిరేక ఉద్యమాన్ని బలూచిస్తాన్‌లో ఉదృతం చేశారు. 1942 నాటికి

ఇండియా పోరాటంలో ఆయన క్రియాశీలక పాత్ర వహించారు. ఈ సందర్భంగా

ప్రభుత్వం అరెస్టు చేసి మూడు సంవత్సరాల కఠిన జైలు శిక్షను విధించింది. ఆయనను ఎన్నిసార్లు జెళ్ళ పాల్జేసనా గాంధీ బాటలో ఆయన ఆరంభించిన అహింసోద్యమం వెనుకంజ వేయలేదు. ఆయన జాతీయోద్యమంలో వేసిన ప్రతి అడుగు గాంధీమార్గంలో సాగింది.

మతంతో రాజకీయాలను ముడివేయరాదని ప్రకటించినా అబ్దుస్‌ సమద్‌ ఖాన్‌ అఖిల భారత ముస్లిం లీగ్ కు భారత జాతీయ కాంగ్రెస్‌కు మధ్య ప్రారంభమైన నిశ్శబ్ద యుద్ధంలో కాంగ్రెస్‌ పక్షం వహించారు. మహమ్మద్‌ అలీ జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతాన్ని నిరశించారు. భారతదేశ విభజనను ఆయన స్పష్టంగా వ్యతిరేకించారు. ఈ వైఖరి ముస్లింలీగ్ నాయకుల ఆగ్రహానికి కారణమైంది. 1947లో పాకిస్తాన్‌ ఆవిర్భ వించగానే పాకిస్తాన్‌ పాలక పక్షం అబ్దుస్‌ సమద్‌ ఖాన్‌ మీద కన్నెర్ర చేసింది.

స్వాతంత్య్రం లభించాక బలూచిస్థాన్‌ ప్రజల హక్కుల కోసం స్వయం ప్రతిపత్తిగల బలూచిస్థాన్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆ డిమాండ్‌తో మండిపడిన మహమ్మద్‌ అలీ జిన్నాఆయనను అరెస్టు చేయించారు. ఆ ఆరెస్టులకు ఏమాత్రం వెరు వకుండా బలూచి ప్రజల న్యాయమైన హక్కుల కోసం, పురోభివృద్థి కోసం వృద్ధాప్యాన్ని కూడ లెక్కచేయక పాలకపక్షం తో పోరాడుతూ అబ్దుస్‌ సమద్‌ ఖాన్‌ ముందుకు సాగారు.

జాతి జనుల విముక్తి కోసం అవిశ్రాంతంగా పరాయిపాలకులతో పోరాడిన బలూచీ యోధులు సమద్‌ ఖాన్‌ బలూచీ ప్రజల స్వయం ప్రతిపత్తి కోసం చివరిదాకా పోరాడుతూ 1972లో హత్యకు గురయ్యారు. ఈ వార్త తెలిసి బలూచిస్థాన్‌ ప్రాంతమంతా శోకసంద్రం కాగా అటు పాకిస్థాన్‌, ఇటు ఇండియాలోని ప్రజలు 'బలూచీ గాంధి' ఖాన్‌ అబ్దుస్‌ సమద్‌ ఖాన్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌