పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

179

81. సుగరా ఖాతూన్‌

(-1968)

జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల పట్ల అత్యంత ఆసక్తి చూపటమే కాక లోతైన అధ్యయనంతో జ్ఞానపరంగా పరిణతి చెందిన మహిళలు జాతీయోద్యమంలో ఎందరో కన్పిస్తారు. అటువంటిమహిళా మేధావులలో ఒకరు సుగరా ఖాతూన్‌.

ఆనాడు నిజాం సంస్థానంలో భాగంగా ఉన్నఉస్మానాబాద్‌లో సుగరా ఖాతూన్‌ జన్మించారు. తల్లి పేరు సైదున్నీసా, తండ్రి సయ్యద్‌ హదీ. 13 ఏండ్ల వయస్సులో జమీందారీ కుటుంబానికి చెందిన మహమ్మద్‌ జమీర్‌ను ఆమె వివాహమాడారు. ఆ వివాహం జరిగిన ఆరు సంవత్సరాలకే ఆమె భర్తను కోల్పోయారు. ఆ తరువాత అత్తింట తలెత్తిన ఆస్థి వివాదాల కారణంగా ఆమె ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలోని తన మేనమామ ఇంట చేరారు.

ఆ సమయంలో ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. ఆమె మంచి చదుదాువరి. సమకాలీన సాంఫిుక-ఆర్థిక-రాజకీయాల పట్ల ఆసక్తి గల ఆమె ఆ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జాతీయోద్యమ వార్తలు ఆమెను నిలువనివ్వటం లేదు. ఆమెలోని దేశబక్తి భావనలు ఊపిరి సలుపనివ్వfiటం లేదు, నిర్లిపంగా కూర్చోనివ్వటంలేదుదాు. మత ఆచార-సంప్రదాయాలు కట్టుబాట్లు కొంత మేరకు ఆటంకం

చిరస్మరణీయులు