పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

పోయాయి. ఆయన ప్రసంగాలు ప్రజలను ఉర్రూతలూగించి, ఉతేజపర్చడం చూసి ఎక్కడ జాతీయోద్యమానికి సంబంధించిన సభ-సమావేశం జరిగినా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించటం ఆచారమైంది. ఆ దశలోనే పాలక వర్గాల డేగకళ్ళు ఆయన మీద పడడంతో లాఠీచార్టీల రుచితో పాటుగా దుర్భర జైలు జీవితాన్నిచవిచూడటం ఆరంభమైంది. పంజాబు కేంద్రాంగా 'మజ్లిస్‌-ఏ-అహరర్‌ ఇస్లాం హింద్‌' సంస్థను ప్రారంభించి,

ఆ సంస్థ అధినతగా శాసనోల్లంఘ న ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్‌ శాసనాలను ఎందుకు ఉల్లంఘంచాలో వివరిస్తూ ఆయన చేసిన ప్రసంగాలు పాలక వర్గాల ఆగ్రహానికి కారణమయ్యాయి. జామయతుల్‌-ఉల్మా-ఏ-హింద్‌ నాయకునిగా కూడా స్వాతంత్య్రం కోసం పోరాడటం ప్రతి ఒక్కరి విధి అని చాలా స్పష్టంగా ఆయన ప్రకటించారు.

1932లో ఇస్లాం మతం ధార్మిక సూత్రాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న అహమ్మదీ యులను (Ahemdiya) మజ్లిస్‌-ఏ-అహరర్‌ నాయకునిగా ఎదుర్కొని అహమ్మదీయుల ప్రధాన కార్యస్థానమైన ఖదియాయాన్‌లో ఏకధాటిగా 5 గంటలపాటు ప్రసంగం చేసి మౌలానా అతావుల్లా సంచలన చరిత్ర సృష్టించారు.

ప్రజలతో నిత్యం గడిపే అతావుల్లా ద్వితీయ ప్రపంచ యుద్ధం సందార్భంగా బ్రిటిష్‌ ప్రబుత్వం భారతీములను సైన్యంలో చేర్చుకోడానికి ప్రాంరంభించిన ప్రయత్నాలను వమ్ము చేయడానికి యుద్ధానికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. ఈ విధంగా ఆయన గళం విప్పిన ప్రతిసారి జైలు జీవితం చవిచూడల్సి వచ్చింది.ఆయన మాత్రం జైలు జీవితానికి భయపడి పరాయి పాలకుల చర్యల మీద ప్రసంగాల నిప్పుల వర్షం కురిపించడం మానలేదు.

బ్రిటిష్‌ పాలకుల కబంద హస్తాల నుండి విముక్తం కావాలంటే ప్రజలంతా ఏకొన్ముఖంగా ఉద్యమించాలని ఉద్బోధిస్తూ భారత దేశమంతా ఆయన పర్యటనలు జరిపారు. హిందూ-ముస్లింలు ఎకంకావడం మాత్రమే కాదు, ఈ గడ్డ మీద నివసిస్తున్న సర్వజనులు ఏకమవ్వాలని ఆయన విస్రుత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం లీగ్ కోరుతున్న పాకిస్థాన్‌ సృష్టిని అతావుల్లా పూర్తిగా వ్యతిరేకించారు. భారత విభజన కోరుతూ, ముస్లింలను ఆకట్టుకోవడానికి అఖిల భారత ముస్లిం లీగ్ సాగించిన ప్రచారాన్ని తన ధార్మిక పరిజ్ఞానంతో, ప్రసంగాల ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు.


భారత విభ జనతరు వాత స్వ గ్రామం వె ళ్ళి రాజకీయాలకు దూరంగా సంస్కరణోద్యమాన్నిచేపట్టి ప్రజల అభ్యున్నతికి ప్రదానంగా మహిళల ప్రగతికి దోహదపడే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ, జీవితాంతం ప్రజాసేవలో గడిపిన అతావుల్లా షా బోఖారి 1967 ఆగస్టు 21న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌