పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

177


80. అతావుల్లా షా బొఖారి

(1891-1967)

స్వరాజ్య సాధనకు సాగుతున్న సంగ్రామంలో భాగస్వాములై తమ ఉత్తేజిత ప్రసంగాల ద్వారా ప్రజలను జాతీయోద్యమ దిశగా కార్యోన్ముఖులను చేసిన అదికొద్ది మంది మహావక్తలలో అతావుల్లా షా బొఖారి ఒకరు.

1891లో బీహార్‌ రాష్ట్రం పాట్నాలో జన్మించారు. ఆయన కుటుంబం ప్రస్తుత పాకిస్థాన్‌లో భాగమైన గుజరాత్‌ వెళ్లి స్థిరపడింది. అతావుల్లా తల్లి ఫాతిమా, తండ్రి జయావుద్ధీన్‌ అహమ్మద్‌. ఆయన చిన్న వ్యాపారి. పసి ప్రాయంలోనే తల్లిని కొల్పోయిన ఆయన మేనమామ ఇంట్లో పెరిగారు. పారశీ, అరబ్బీ, ఉర్దూ భాషలు నేర్చుకుని, ఆధ్యాత్మిక విద్యను పూర్తిచేసి అమృతసర్‌ వచ్చి, అక్కడ మత బోధకునిగా జీవితాన్ని ప్రారంభించి 40 సంవత్సరాల పాటు ఖురాన్‌ గ్రంథాన్ని బోధిస్తూ గడిపారు.

బ్రిటిష్‌ పాలకుల పట్ల వ్యతిరేకత గల కుటుంబం నుండి వచ్చిన ఆయన 1921లో ఖిలాఫత్‌ ఉద్యమం ద్వారా జాతీయోద్యమంలో ప్రవేశించారు. ఖిలాఫత్‌ ఉద్యమం సందర్భంగా ఆయనలో దాగి ఉన్న మహావక్త బహిర్గతమయ్యాడు. బ్రిటిష్‌ పాలకుల సామ్రాజ్యవిస్తరణ కాంక్షను, ఆంగ్లేయాధికారుల కుయుక్తులను ఎండగడ్తూ నిప్పులు చెరిగ ప్రసంగాలతో ఆయన విసురుతున్నవాగ్బాణాల ధాటికి పాలకవర్గాలు తట్టుకోలేక

చిరస్మరణీయులు