పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

169

76. బేగం సకీనా లుక్మాని

( 1865-1960)

ఆది నుండి స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన పాత్ర వహించిన తయ్యాబ్జీ కుటుంబం పలువురు మహిళలను జాతీయోద్యమానికి అంకితం చేసింది. మూడు తరాలకు చెందిన ఆ మహిళల్లో రెండు పదులు దాటని మహిళల నుండి ఎనిమిది పదులు దాిటిన వారి వరకూ ఉన్నారు. అటువంటి పెద్ద వయస్సు మహిళలలో బేగం సకీినా లుక్మాని ఒకరు.

1865 ప్రాంతంలో గుజరాత్‌ రాష్ట్రంలో జన్మించిన ఆమెస్వాతంత్య్రోద్యమ నేత బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ కుమార్తె. భారత జాతీయ కాంగ్రెస్‌ తొలినాి సమావేశాలకు అధ్యా కత వహించిన ప్రముఖడయన. బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ గృహంలో ఎల్లప్పుడు విలసిల్లుతున్న రాజకీయ వాతావరణం ఫలితంగా చిన్ననాటే జాతీయ భావననలను అందిపుచ్చుకున్న ఆమె జాతీయోద్యామంలో భాగంగా సాగిన అన్నికార్యక్రమాలలో ప్రత్య కంగా పాల్గొన్నారు.

గాంధీ పిలుపు మేరకు 1930లో గుజరాత్‌లో సాగిన విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధ ఉద్యమాలలో ఆమె క్రియాశీలక పాత్ర వహించారు. ఆమె వయస్సు అప్పటికి 65 సంవత్సరాలైనప్పటికి ఎంతో చురుగ్గా పనిచేసి అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువుల విక్రయశాలలు, మద్యపానశాలల ఎదుట మండు టెండలను కూడ లెక్క చేయక పికెటింగులు నిర్వహించారు. గుజరాత్‌లో

చిరస్మ రణయులు