పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ కారణంగా 1921లో ప్రారంభమైన ఆయన ఒక సంవత్సరం జైలు జీవితం 1930లో 2 సంవత్సరాలు, 1932, 1940లలో ఏడాది చొప్పున సాగింది. ఆయనను ప్రబుత్వం అతిప్రమాదకారిగా భావించడంతో 1942 లో మూడేండ్ల కరిన కారాగారవాసమే కాకుండా, ఏకాంతంగా జైలులో గడపాల్సి వచ్చింది. ఈ సుదీర్గ… జైలు జీవితం ఆయనలోని వక్తకు, కవికి ఎంతో తోడ్పాటునిచ్చింది. కఠిన కారాగారవాసం అనుభవిస్తూ, తన పూర్వీకుల త్యాగాలను స్మరించుకుంటూ, ఉద్వేగానికి లోనైన ఆయన 'ఆసిర్‌' కలం పేరుతో పరవళ్ళుతొక్కే కవిత్వాన్ని పండించారు.

1919లో ఏర్పడిన JAMAITH-UL-ULMA-I-HIND తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటమే కాక ఆ సంస్థకు కార్యదర్శిగా, అధ్యా కునిగా కూడాబాధ్య తలను నిర్వహిం చారు. ఈ సంస్థ నేతృత్వంలో ప్రజలను ప్రధానంగా ముస్లింలను జాతీయోద్యమంలో పాల్గొనాల్సిందిగా సుమారు 900 మంది ఉలేమాలు చారిత్రాత్మక పిలుపునిచ్చారు. శాంతియుత ప్రజాస్వామ్య పోరాటానికి ప్రాధాన్యత నిచ్చే సయీద్‌ అహమ్మద్‌ అవసరమైతే సాయుధ పోరాటంలో ప్రాణత్యాగాలకు కూడా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడాన్నిఅంగీకరించని సయీద్‌, ముసింలీగ్ విభజన రాజకీయాలను విమర్శించారు. మతమనోభావాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపు కోవాలనుకుంటున్న రాజకీయ శక్తులను సహంచని ఆయన భారతదేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. భారత విభజన ప్రతిపాదనను తొలినుండి వ్యతిరేకించిన ఆయన మహమ్మదాలి జిన్నాను ఎంత తీవ్రంగా విమర్శించారో అంతకంటే ఎక్కువగా నెహ్రూ˙, పటేల్‌లను కూడా విభజనకు బాధ్యుల్నిచేస్తూ దుయ్యబట్టారు. విభజన పరిణామాలలో భయభ్రాంతులైన ప్రజలలో ధైర్యాన్నికలుగజేసేందుకు సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహంలో ఆయన వెంట ఉండి సయీద్‌ ప్రధానపాత్ర వహించారు.

భారతదేశం 'సంపూర్ణ స్వరాజ్యం' సాధించాక జరిగిన తొలి రిపబ్లిక్‌ దినోత్సవం నాడు, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఎర్రకోటలో జరిగిన 'ఉర్దూ ముషాయిరా' ను సయీద్‌ అహమ్మద్‌ ఘనంగా నిర్వహించారు. ఆరోజు ఆయన నిర్వహించిన ముషాయిరా సాంప్రదాయకంగా నేటికి కొనసాగుతుంది. ఈ విధంగా విముక్తి పోరాటాన్ని తన విధిగా ప్రకటించి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అవిశ్రాంతంగా పోరాడిన సమరశీలుడు, కవి, విఖ్యాత వక్త, కార్యశారుడైన మౌలానా సయీద్‌ అహమ్మద్‌ 1959 డిసెంబరు 4న, తన జ్ఞాపకాలను భారతీయులకు వదలి, శాశ్వత విశ్రాంతికై తరలి వెళ్ళిపోయారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌