పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

167

75. మౌలానా అహమ్మద్‌ సయీద్‌

( 1888-1959)

'స్వాతంత్య్రం కోసం పోరాడటం నా విధి. పోరాట యోధునిగా పెన్షన్‌ స్వీకరించడం నా ధర్మప్రకారం నిషిద్దం', అంటూ భారత పబుత్వం మంజూరు చేసన పెన్షన్‌ సౌకర్యాన్ని తిరస్కరించిన కొద్దిమంది స్వాతంత్య్రసమరయోధులలో అహమ్మద్‌ సయీద్‌ ఒకరు.

1888లో ఢిల్లీ సమీపంలోని షాజానాబాద్‌లో సయీద్‌ జన్మించారు. చిన్ననాటి నుండే బానిసత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తచేయడం ఆయన విలక్షణ లక్షణంగా తల్లి తండ్రులు గమనించారు. విద్యార్థి దశ నుండే మంచివక్త గానే కాకుండా చక్కని సాహిత్యాన్ని సృష్టించి మంచికవిగా ఆయన సాహిత్యరంగంలో రాణించారు.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత అంతులేకుండా పోయిన బ్రిటిషర్ల దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆరంభమైన 'వలీ ఇలాహీ' ఉద్యమంతో సయీద్‌ బాగా ప్రభావితులయ్యారు. ఆ ఉద్యమ ప్రేరణతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సయీద్‌ అతిత్వరలోనే జాతీయోద్యమంలో ప్రవేశించారు. అద్బుతవక్త అయిన మహమ్మద్‌ తన ఆలోచనాత్మక ప్రసంగాలతో శ్రోతలను ఉర్రూతలూగించారు, ఆలోచింపచేశారు. కవితలతో పరాయి పాలకులపై అక∆రాగ్నులు కురిపించారు.

ఖిలాఫత్‌ ఉద్యమం నుంచి ప్రారంభమై, స్వాతంత్య్రం సిద్ధించే వరకు సాగిన అన్ని

చిరస్మరణీయులు