పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

159

71. బతఖ్‌ మియా అన్సారి

(1867-1957)

ఆంగ్లేయులు కల్పిస్తామన్న మంచి ఉద్యోగం, అందిస్తామన్న ఆర్థిక సహాయతను తృణప్రాయంగా త్యజించి మహాత్మాగాంధీని విషప్రయోగం నుండి కాపాడి, ఆంగ్లేయుల ఆగ్రహానికి గురై డూర్భరమైన జీవితాణ్ణీ గడిపిన యోదులు బతఖ్‌ మియా అన్సారి.

1867లో బీహార్‌ రాష్ట్రంలోని మోతిహరీ గ్రామంలో అన్సారి జన్మించారు. తండ్రిమహమ్మద్‌ అలీ అన్సారీ. చిన్నప్రబుత్వఉద్యోగి అయినటువంటి బతఖ్‌ మియా లభిసున్న జీతంతో తన కుటుంబీకులతో తృప్తిగా కాలం గడుపుతున్నారు.

ఆంగ్లేయ ప్లాంటర్లు రైతాంగంపై క్రూరచర్యలకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు భారత జాతీయ కాంగ్రెస్‌ మహాత్మా గాంధీజీని 1917లో బీహార్‌ రాష్ట్రంలోని చంపారన్‌కు పంపింది. గాంధీజీ ఆ ప్రాంతాన్నికేంద్రంగా చేసుకుని రైతులను కలసి విచారణ ప్రారంభించగా, ఆ విచారణలో తమ కిరాతకాలు బయట పడతాయన్న భయం నీలిమందు తయారీదారులకు పట్టుకుంది. ఆ కారణంగా గాంధీజీని రంగం నుండి పూర్తిగా తప్పించాలని ప్లాంటర్లు పథకం వేశారు. అందులో భాగంగా మోతీహార్‌ వచ్చిన గాంధీజీని విందుకు ఆహ్వానించి విషాహరం ద్వారా అంతం చేయాలనుకున్నారు. ఈ కార్యక్రమాన్ని భారతీయుడి ద్వారా జరిపితే తమ చేతులకు మట్టి అంటదని భావించారు.

చిరస్మరణీయులు