పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

అనుభవించారు. మౌలానా మాత్రమే కాకుండా ఆయన బిడ్డలు కూడా జాతీయోద్యమంలో పాల్గొని తండ్రి అడుగుజాడల్లో నడిచి దుర్భర జైలు జీవితాన్నిచవిచూడగా ఆయన భార్య షఫాతున్నీసా బీబి, తన ఆడబిడ్డలతో కలసి పోలీసుల దాడులను దాష్టికాలను అనుభవించారు. కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చినా పడినా ఇటు ప్రజల నుండి అటు పార్టీ ఆర్థిక సహాకారమిచ్చేందుకు ముందుకు వచ్చినా మౌలానా ఎటువంటి ఆర్థిక సహాయం స్వీకరించకుండా ముందుకు సాగారు.

బ్రిటిష్‌ ప్రబుత్వం సాగించిన దుర్మార్గాలు, ఆస్థుల జప్తుల వలన సర్వం కొల్పోయినా, ఉన్నదానితో ఆశ్రితులను సంత్పప్తి పర్చుతూ, ఆంగ్లేయ ప్రభుత్వం సాగిస్తున్నదౌర్జన్యం నుండి శాశ్వతంగా బయట పడాలని ఆయన కోరుకున్నారు. ఈ విషయంలో ఆయన భార్య షఫాతున్నీసా బేగం భర్త ఆలోచనలకు ఆలంబనగా నిలిచారు. స్వాతంత్య్రోద్యమం లోని ప్రతి ఘట్టంలోనూ మౌలానా చురుగ్గా పాల్గొనటం, ప్రతిసారి ప్రభుత్వఆగ్రహానికి గురికావడం, భర్త-బిడ్డలు జైళ్ళపాలవటం ఆ కుటుంబానికి నిత్యకృత్యమైంది.

ఆధ్యాత్మిక-ధార్మిక విషయాలలో ముస్లింలకు మార్గదర్శకత్వం వహించే లక్ష్యం తో ఏర్పడిన JAMAIT UL ULEMA సంస్ధలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ సలహా మీద1920లో MAJLIS -E-AHARAR ( The Societyof Freeman) అను సంస్థను ప్రారంభించి ప్రజాసేవా కార్యక్రమాలను నిర్వహించారు.

మౌలానా జీవితపర్యమ్తం జాతీయవాదిగా కొనసాగుతూ తాను నమ్మిన సిద్దాంతాల పట్ల నిబద్దాతతో పనిచేశారు.1947 విభజన వలన ఏర్పడిన విద్వేష వాతావరణంలో ఆయన కుటుంబం శరణాదర్ధుల శిబిరంలో శరణు పొందాల్సిన అగత్యం ఏర్పడి జన్మభూమి లూధియానాను అతికష్టం మీద వదాలాల్సి వచ్చింది. ఈ పరిస్థితులకు భార్య-భర్తలు విచలితులయ్యారు. చివరకు ఢిల్లీ వెళ్ళి అపరిచితుల గృహంలో తలదాచుకున్నారు. సన్నిహితులు పాకిస్థాన్‌ వెళ్ళమని సలహా ఇచ్చినా ఏదిఏమైనా స్వస్థలాన్ని వదాలిపెట్టేది లేదని భీష్మించుకుని కూర్చున్న ఆ దంపతులు చేదు అనుభవాలను చవిచూడాల్సి వచ్చింది. ఆనాటి జ్ఞాపకాలు మౌలానాను చివరికంటా వెంటాడుతూనే ఉండి పోయాయి.

స్వాతంత్య్రోద్యమంలో మౌలానా నిర్వహించిన పాత్రను చరిత్రకారులు తారాచంద్‌ వివరిస్తూ, 'His devotion to principle such as martyrs might envy. He never deviated from his beliefs and stood by them firm as rock. He is a man of amazing courage and endurance.' అని ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. మంచి ఉపన్యాసకుడిగా ప్రశంసలందుకున్న మౌలానా 1956 సెప్టెంబర్‌ 3న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌