పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

153

68. యం. ఆసఫ్‌ అలీ

( 1888-1953)

స్వాతంత్య్ర సమరంలో పాల్గొని తమ సర్వస్వం అంకితం చేసిన మహనీయులు అనేకులుకాగా, తాము కలలుగన్న స్వరాజ్యాన్ని కన్నులారాగాంచటమే కాక, భవ్యభారత నిర్మాణంలో భాగస్వామ్యం వహించిన అదృషవంతులు బహు అరుదు. అటువంటి అరుదైన అవకాశం పొందిన ధన్యజీవులలో యం.ఆసఫ్‌ అలీ ఒకరు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బిజినోర్‌ జిల్లా నాగిన గ్రామంలో 1888 మే 11న సంపన్న కుటుంబంలో ఆయన జన్మించారు. ఉన్నత విద్యాభ్యాస్యం కోసం లండన్‌ వెళ్ళి 1914లో ఇండియాకు వచ్చిన ఆయన ఢిల్లీలో న్యాయవాదిగా జీవితాన్ని ఆరంభించారు. అరుణా గంగూలిని మతాంతర వివాహం చేసుకున్నారు. ఆమె అగ్రశ్రేణి స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరుగా అరుణా ఆసఫ్‌ అలీ గా ఖ్యాతిగాంచారు.

డాక్టర్‌ అనీబిసెంట్ ఆరంభించిన 'హోంరూల్‌' ఉద్యమం ద్వారా ఆసఫ్‌ అలీ క్రియాశీలక రాజకీయ జీవితాన్నిప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగాలను, ఆయన రాతలను ప్రభుత్వం నిషేధించగా తన కేసును తాను వాదించుకుని విజయం సాధించటంతో ఆయనకు విశేష ప్రాచుర్యం లభించింది.

డాక్టర్‌ ముక్తార్‌ అహ్మద్‌ అన్సారితో కలసి ఖిలాఫత్‌ ఉద్యమ నిర్మాణంలో ప్రధాన పాత్ర నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు న్యాయవాదవృత్తిని వదిలేసి

చిరస్మరణీయులు