పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

మాతృదేశం పరాయి పాలనలో మగ్గుతు న్నంత కాలం తమ ధార్మిక విద్యా ప్రచారానికి, మత స్వేఛ్చ కు, ప్రజల సంపూర్ణ స్వాతంత్య్రానికి ఏమాత్రం అవకాశం ఉండదని ప్రకటించిన ఆయన ఖిలాఫత్‌-సహాయనిరాకరణోద్యమంలో పాల్గొనటం ద్వారా జాతీయోద్యమంలో ప్రవేశించారు. ప్రబుత్వం మీదతిరుగుబాటు గాంధీజీ మార్గనిర్దేశనంలో సాగాలని, ప్రద్తుత పరిస్థితుల నేపద్యంలో సాయుధ పోరాటాలు సత్పలితాలను సాధించలవన్నారు.1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ జాతీయ సభ్యుడయ్యాక శాసనోల్లంఘనోద్యమంలో ఢిల్లీ ప్రజానీకానికి నేతృత్వం వహించారు. ఆ కారణంగా కిఫాయుతుల్లాకు జైలుశిక్షపడింది. అప్పటినుండి ఆయనకు కరిన కారాగారవాస శిక్షలు సాధారణమైన అనుభవాలయ్యాయి.

జాతీయోద్యమం నుండి కిపాయతుల్లాను దూరంచేయాలని బ్రిటిష్‌ పాలకులు ఆశలు చూపగా, స్వాతంత్య్రం కోసం పోరాటం ముస్లింల మతపరమైన విధి అని ఆయన ప్రకటించారు. జహుళ జాతుల, మతాల ప్రజలు సహజీవనం సాగించే భారత గడ్డ మీద ఇస్లాం ప్రబోధించే సిద్దాంతాల ఆధారంగా రాజ్యాన్ని స్థాపంచ ప్రయత్నించటం సరికాదని అన్నారు. జాతీయవాదిగా భారత విభజన, ద్విజాతి సిద్ధాంతామ్మి ఇస్లాం ధార్మిక సిద్దాంతాల ప్రాతిపదికన ఖండిసూ,హిందూ-ముసింల మధ్యన ఐక్యతావశ్యకత కోసం ఖిఫాయతుల్లా నిరంతరం కృషిచేశారు. ముస్లింలు- ముస్లిమేతరులను వివక్షఎంతమాత్రం తగదంటూ ఐక్యంగా ముందుకు సాగినప్పుడు మాత్రమే ఉమ్మడి లక్ష్యం సిద్ధిస్తుందని ఆయన బలంగా ప్రచారం చేశారు.

పాశ్చ్యాత్య విద్య, సంస్క ృతి వలన సమాజం రుగ్మతలకు గురవుతుందని భావించిన ఆయన సంస్కరణోద్యమాన్ని కూడాఆరంభించారు. పురుషులతోపాటు మహిళలు కూడా విద్యావంతులు కావాలంటూ వారికోసం ప్రత్యేక పాఠశాలలను స్థాపించాలన్నారు. మానవులంతా భగవంతుని సృష్టిలో భాగం కనుక అంటరానితనం ఏమాత్రం సరికాదని అన్నారు. మనుషుల్లో ఉచ్ఛ-నీచాలను విధానం స్వార్థపరుల సృష్టి మాత్రమేనంటూ సహపంక్తి భోజనాలలో, సహజీవనం సాగించటంలో ఏమాత్రం తప్పులేదన్నారు.

స్వాతంత్య్రం లభించాక ధార్మిక విద్యాబోధన గావిస్తూ కాలం గడిపిన ఆయన పలు గ్రంథాలను రాశారు. భారత పబుత్వం ఆయనకు పలు సౌకర్యాలను, ఆర్థిక సదుపాయాలను ప్రకటించగా, ఆ సదుపాయాలను స్వీకరించడమంటే తమ దేశభక్తికి విలువ కట్టడమేనని ప్రకటించారు. ఆసౌకర్యాలను, సదుపాయాలను తిరస్కరించిన ముఫ్తీ ఖిఫాయతుల్లా చివరి వరకు పేదరికంతో సహజీవనం చేస్తూ 1952 డిసెంబరు 31న ఢిల్లీలో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌