పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

ఒక్కసారిగా,'సైమన్‌ గోబ్యాక్‌' అంటూ నినదిస్తూ ముందుకు ఉరికారు. ఆ హఠాత్పరిణామం నుండి తేరుకున్న పోలీసులు ఆయనను అడ్డుకునేందుకు పరుగులు తీశారు. ఆ చర్యకు ఆగ్రహించిన ప్రభుత్వం ఆయన మీద పలు ఆంక్షలు విధిస్తూ, ఆయనను న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసేందుకు అనుమతిని నిరాకరించింది.

విద్యార్థి, యువజనుల శక్తియుక్తుల పట్ల అత్యంత విశ్వాసం గల యూసుఫ్‌ తొలుత నుండి విద్యార్థి యువజనోద్యమం వైపు దృషిని కంద్రీకరించారు. యువకులను ప్రగతిశీల పోరాట కార్యకర్తలుగా తీర్చిదిద్దాలంటే సైద్దాంతిక అవగాహన, ప్రపంచ పరిణామాల చరిత్ర అధ్యయనం, సత్పలితాలను సాధించగల ఆచరణాత్మక వ్యూహాల పరిజ్ఞానం అవసరమని భావించారు. అందుకు కోసం VANGUARD అను వారపత్రికను నడిపారు. పలు గ్రంథాలను ప్రచురించారు. పలు సంస్థలను ప్రారంభించారు.

ఆ సంస్థల ఆధ్యర్యంలో జాతీయోద్యమంలో భాగంగా జరిగిన ప్రతి ప్రతిఘటన ఉద్యమంలో ముందుండి యువతను నడిపంచారు. ఈ చర్య ల వలన ఆయన పలుమార్లు పోలీసుల దాస్టీకాన్ని, జైలు జీవితాన్ని రుచిచూడాల్సి వచ్చింది. ఆయన ఎక్కడ ఉన్నా ప్రజల హక్కుల కోసం పోరాడటం మానలేదు. జైళ్లల్లో విచారణ ఎదుర్కొంటున్న నిందితులు, ఖైదీల హక్కుల కోసం పోరాడారు. అతి దుర్భరంగా జీవితాలు గడుపుతున్న గుమాస్తాల బ్రతుకుల్లో వెలుగులు నింపిన 'SHOPS AND ESTABLISHMENT ACT ఉనికిలోకి రావడానికి కూడా ఆయన కారణమయ్యారు.

1940లో ప్రారంభమైన వ్యక్తి సత్యాగ్రహంలో యూసుఫ్‌ మొహర్‌ అలీ చురుకైన పాత్ర వహించారు. బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఊపేసిన 'క్విట్ ఇండియా' నినాదాన్ని అంతకు మందుగానే తాను రాసిన 'క్విట్ ఇండియా' గ్రంథాం ద్వారా ప్రచారంలోకి తెచ్చి 'క్విట్ ఇండియా' నినాదం సృష్టికర్తగా ఖ్యాతిగడించారు.

స్వాతంత్య్రం సిద్దించాక భారతదశం రండుగా చీలిపోవటం సహజంగానే ఆయనకు బాధ కలిగించింది. 1948 మార్చిలో జరిగిన బొంబాయి లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఎన్నికలలో సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన ఆయన శాసనసభ్యునిగా కూడా ఆదర్శవంతమైన పాత్రను నిర్వహించారు. ఉద్యమ జీవితంలో ఆయన పలుమార్లు లాఠీ దెబ్బలను రుచి చూస్తూ, జైలు జీవితం గడిపారు. ఆ శిక్షల ప్రభావం వలన ఆయన ఎరవాడ జైలులో ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆ ఆనారోగ్యం నుండి ఆయన మళ్ళీ కోలుకోలేదు. చివరకు మిత్రులు జయప్రకాష్‌ నారాయణ పక్కనుండగా 1950 జులై 2న యూసుఫ్‌ జాఫర్‌ మెహర్‌ అలీ తుదిశ్వాస వదిలారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌