పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

147

65. యూసుఫ్‌ జాఫర్‌ మెహర్‌ అలీ

(1903-1950)

భారత జాతీయోద్యామ చరిత్రలో ప్రదాన పోరాట ఘట్టాల సరసన నిలచిన 'సైమన్‌ గోబ్యాక్‌' ఉద్యమంలో విప్లవించిన ఉద్యమకెరటం యూసుఫ్‌ జాఫర్‌ మెహర్‌ అలీ.

1903 సెప్టెంబర్‌ 3న బొంబాయిలోని సంపన్నపారిశ్రామికవేత్తల కుటుంబంలో ఆయన జన్మించారు. బ్రిటిష్‌ పాలకుల చర్య లకు వ్యతిరేకంగా నిప్పులు కురిపించే ఆయన విద్యార్థిగా నున్నప్పుడే, The British Rulers are like Dogs. If you kick them, They will lick you. But if you lick them, they will kick you, అన్నారు. చిన్ననాటి నుండే స్వాతంత్య్రోద్యమం, సామ్యవాదం పట్ల ఆకర్షితులయ్యారు.

1925లో 'యంగ్ ఇండియా సొసైటీ' ఆరంభించి యువజనుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1928 జనవరి 21న జరిగిన సమావేశంలో సొసైటీచే 'సంపూర్ణ స్వరాజ్యం', 'సైమన్‌ కమీషన్‌ బహిష్కరణ' తీర్మానాలు చేయించారు. సంపూర్ణ స్వరాజ్యం పిలుపును ఆనాడు కొందరు ప్రముఖ నాయకులు చిన్నపిల్లల చేష్టలని ఎద్దేవా చేయగా, ఆ విమర్శకు సమాధానంగా THE CHILD IS THE FATHER OF THE MAN అని ఘాటైన సమాధానమిచ్చారు. 1928 ఫిబ్రవరి 3న సైమన్‌ కమీషన్‌, బొంబాయిలోని మోల్‌ స్టేషన్‌ లో ఓడ దిగగానే ముందుగా వేసుకున్న పథకం ప్రకారంగా యూసుఫ్‌

చిరస్మరణీయులు