పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

137

60. మౌల్వీ ఉమర్‌ అలీషా

(1885-1945)

అటు జాతీయోద్యమం, ఇటు ఆధ్యాత్మికోద్యమం మరోవైపు సాహిత్యోద్యమం, ఇంకో వైపు సంఘ సంస్కరణోద్యమం, చివరకు రాజకీయోద్యమాలను ఏకబిగిన సాగించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఖ్యాతిగడించిన అరుదైన యోదులు మౌల్వీ ఉమర్‌ అలీషా.

1885 ఫి బవరి 28న, ఆంధ్రపదశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఆయన జన్మించారు. చిన్నవయస్సులోనే కవితలల్లడం ఆరంభించి 'కవిగారు' అని పిలవబడ్డారు. పిఠాపురంలో ఉన్నత పాఠశాల వరకు మాత్రమే విద్యాభ్యాసం చేసిన ఆయన ఆ తరువాత పండితుల సహచర్యంలో సాహిత్యస్రస్టగా రూపొందారు. బహు భాషాకోవిదునిగా ఘనత వహించారు. జాతీయ భావం, సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సమ భావనలతో పాటుగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా, మహిళాభ్యుదయాన్ని, ప్రజా చైతన్యాన్నికాంక్షిస్తూ అసంఖ్యాకంగా రచనలు చేశారు. మతసామరస్యం ఆకాంక్షిస్తూ, మతం పేరుతో సాగుతున్న దాష్టీకాలను ఉమర్‌ అలీషా తీవ్రంగా నిరసించారు.

నాలుగు పదులు దాటని వయస్సులోనే ఉమర్‌ అలీషా విద్వత్తుగల ప్రముఖునిగా వెలుగొందటంతో 1924లో All India Oriental Conference లో 'పండిట్' బిరుదుతో సత్కరించగా, అలీఘర్‌ విశ్వవిద్యాలయం 'మౌల్వీ' బిరుదు ఇచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన

చిరస్మరణీయులు