పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

1915లో మౌలానా హసన్‌ పదకం మేరకు ఆయన ఆఫనిస్థానకు వెళ్ళారు. ఆప్గనిస్థాన్‌ నుండి పరాయిపాలకులకు వ్యతిరేకంగా విజృంభించమని స్వదేశీయులను రచ్చగొడుతూ, అందుకు కావాల్సిన మద్దతును, సాధన సంపత్తిని కూడగట్టసాగారు. బ్రిటిష్‌ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను స్థానిక భారతీయ విప్లవకారులతో కలసి ముమ్మరం చేశారు. ఆ క్రమంలో 1916లో రాజా మహేంద్రా వర్మ, ప్రొపెసర్‌ బర్కతుల్లా భూపాలి తదితరులతో కలిసి ప్రప్రథమ ప్రవాస భారత ప్రభుత్వాన్ని కాబూల్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వంలో ఆయన విదేశీ రక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేపట్టారు.

ఈ సందర్భంగానే భారత స్వాతంత్య్రసంగ్రామంలో 'సిల్క్‌ అక్షరాల కుట్ర' గా ఖ్యాతి గాంచిన విప్లవ కార్యక్రమాన్నిరూపొందించటంలో ఒబైదుల్లా ప్రముఖ పాత్ర వహించారు. విప్లవకారుల ప్రయత్నాలు విజయవంతం కాకపోవటంతో పలువురు నేతల మీద 'కుట్ర' కేసులు నమోదయ్యాయి. మౌలానా సింధీ అజ్ఞాతంలోకి వెళ్ళాల్సివచ్చింది. ఆయనను ప్రమాదకర వ్యక్తిగా పరిగణించిన బ్రిటిష్‌ పాలకులు, ఆఫ్గనిస్థాన్‌ నుండి బయటకు పంపేందుకు గాని, వీలుచిక్కితే అంతమొందించానికి ప్రయత్నాలు సాగించారు. ఆ ఒత్తిడి వలన ఒబైదుల్లా సింధీ చివరకు ఆఫ్గనిస్థాన్‌ను విడిచి మాస్కో చేరుకున్నారు.

ఈ విధంగా బ్రిటిష్‌ ప్రబుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చిన మౌలానా 1926లో ఇటలీ మీదుగా హిజాజ్‌ చేరుకున్నారు. అరేబియాలో విప్లవ కార్యకలాపాలను నిర్వహిస్తూ 12 సంవత్సరాల పాటు గడిపారు. ఈ విధంగా స్వాతంత్య్ర సముపార్జన లక్ష్యంతో మొత్తం మీద 24ఏండ్ల పాటు ప్రవాస జీవితం గడపిన మౌలానా సింధీ 1939లో స్వదేశానికి తిరిగి వచ్చారు. మతం ప్రాతిపదికన దేశాన్ని చీల్చటం సరికాదన్నారు. ఆయన 'లీగ్' వేర్పాటువాదాన్ని విమర్శించారు. అన్ని జాతుల ప్రజలు సత్సంబంధాలతో కలసిమెలసి జీవించాలన్నారు. ఈమేరకు విభిన్నసాంఘిక సమూహాలు నివశిస్తున్న భారత దేశానికి అనువైన రాజ్యాంగం ముసాయిదాను ఆయన రూపొందించారు. ఆ రాజ్యాంగం మన దేశానికి సరైనది మాత్రమే కాకుండా చాలా ఉన్నతమైనదని జవహర్‌లాల్‌ నెహ్రు˙ లాంటి ప్రముఖుల ప్రశంసలను అంద్కుంది. ఈ సందర్బంగా ప్రజల-పండితుల ప్రసంసలు అందుకున్న పలు గ్రంథాలను రచించారు.

ఈ విధంగా స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అతి సుదీర్గకాలం ప్రవాస జీవితం గడపిన అసమాన విప్లవకారుడిగా ఖ్యాతిగడించిన మౌలానా ఒబైదుల్లా సింధీ తాను కలలుగన్న స్వతంత్ర భారతదేశ పతాక రెపరెపలు చూడకుండానే, తీవ్ర అస్వస్ధతకు లోనై 1944 ఆగస్టు 22న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌