పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

135

69. మౌలానా ఒబైదుల్లా సింధీ

( 1872-1944)

జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన పలువురు నాయకులకు పుట్టినిల్లుగా ఖ్యాతిగాంచిన దేవ్‌బంద్‌ 'దారు-ఉల్‌-ఉలూమ్‌' నుండి భారత స్వాతంత్ర సంగ్రామం లోకి దూసుకు వచ్చిన విప్లవాగ్ని శిఖ మౌలానా ఒబైదాుల్లా సింధీ.

ప్రస్తుత పాకిస్తాన్‌లోని సియోల్‌కోట్ జిల్లా చియాన్నాలి గ్రామంలో 1872 మార్చి 10న ఒబైదుల్లా సింధీ జన్మించారు. సిక్కు కుటుంబానికి చెందిన ఆయన 8 వ తరగతి చదువుతున్నప్పుడు మౌలానా ఇస్మాయిల్‌ షాహిద్‌ రాసిన Taqwiat-ul-Imag గ్రంథంలో చదివి దాని వల్ల ప్రభావితుడై ఆ తరువాత 1887లో ఇస్లాం మతం స్వీకరించారు.

మహమ్మద్‌ సిద్దిఖీ అను గురువు వద్ద కొంతకాలం విద్యాభ్యాసం తరువాత, పదిహేడు సంవత్సరాల వయస్సులో దేవ్‌బంద్‌లోని 'దారు-ఉల్‌-ఉలూం'లో విద్యార్థిగా ప్రవేశం పొందారు. ఈ విద్యాసంస్థ ప్రదానాచార్యుడెన మౌలానా మహమ్మదుల్‌ హసన్‌ ప్రబావంతో ఆయనలోని విప్లవభావాలు మరింతగా వికసించాయి. గురువు ఆదేశం మేరకు 'దారు-ఉల్‌ -ఉలూం'లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తరువాత మౌలానా హసన్‌ మారదర్శకంలో బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలకు యువతను సిద్దం చేసేందుకు ఉద్దేశించబడిన పలు సంస్థలను ఏర్పాటు చేసి వాటిని సమర్థవంతంగా నిర్వహించారు.

చిరస్మరణీయులు