పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

133

58. అల్లా బక్ష్ సుంరో

(1887-1943)

మత రాజకీయాలు మనుషుల మస్తిష్కాలను కలుషితం చేసి, నిష్పాకికతను దూరం చేస్తాయ ని ప్రకటించిన నేరానికి మతోన్మాద రాజకీయ స్వార్దపరశక్తుల భయానక కుట్రలకు గురైన స్వాతంత్య్రసమరయోదులలో గణుతికెక్కివారు అల్లా బక్ష్ సుంరో.

ప్రసు త పాకిస్థానలో భాగవొ న సింథ్‌ ప్రాంతం, శిఖాపూర్‌ పట్టణంలోని ఒక సంపన్న కుటుంబాన 1887లో ఆయన జన్మించారు. చిన్నతనంలోనే వ్యాపారంలోకి ప్రవేశించిన అల్లా బక్ష్, వ్యాపార దృక్పధానికి సేవా దృక్పధం జతచయడం ఫలితంగా 23 సంవత్సరాల వయస్సులో ఆయన జాకోబాద్‌ పురపాలక సంఘం సబ్యునిగా ఎన్నికయ్యారు. ఆ విధంగా రాజకీయరంగ ప్రవేశం చేసిన ఆయన ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగారు.

1935లో భారత ప్రబుత్వ చట్టం ఉనికిలోకి వచ్చాక జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సింథ్‌ ప్రాంతపు ప్రధాన మంత్రి అయ్యారు. చిన్నవయస్సులో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అల్లా బక్ష్ సుంరో, 38 సంవత్సరాల వయస్సులో సింథ్‌ ప్రధానమంత్రి పదవి చేపట్టి చరిత్ర సృష్టించారు.

ఆ తరువాతి క్రమంలో మతాలకు అతీతంగా విశాల దృక్పథంతో ప్రజల మన్ననలు చూరగొంటూ రాజకీయ రంగాన ముందుకు సాగిన అల్లాబక్ష్ జాతీయోద్యమం పట్ల

చిరస్మరణీయులు