పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉరికంబం ఎక్కడానికి సిద్దపడ్డ 'కాకోరి వీరుడు' అష్పాఖుల్లా ఖాన్‌, సాయుధపోరాటానికి వ్యూహరచన గావించిన మౌలానా ముహమ్మద్‌ హసన్‌, చివరిశ్వాస వరకు హిందూ, ముస్లింల ఐక్యత కోసం శ్రమించిన డాకర్‌ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి లాంటి యోధు లకు సంబంధించిన అత్యంత విలువైన సమాచారంతోపాటుగా ఆనాడు దేశ విభజనను వ్యతిరేకిసూ,హిందూ, ముస్లిం ఐక్యతను ప్రగాఢంగా వాంఛిస్తూ అ విశ్రాంత ప్రయత్నాలు చేసిన పలువురు వ్యక్తుల కృషి ఈ గ్రంథంలో నమోదయ్యింది.

బీహార్‌ రాష్ట్రం చంపారన్‌లో గాంధీజీని విషాహారం నుండి రక్షించిన బతఖ్‌ మియా అన్సారి లాంటి సామాన్యులు, జాతీయ కాంగ్రెస్‌ను ప్రబావితం చేయ గలిగినంతగా, ఆంగ్లేయుల పెత్తనానికి వ్యతిరేకంగా రైతాంగ పోరాటాన్ని నిర్వహించిన షేక్‌ ముహ్మద్‌ గులాబ్‌ లాంటి రైతు నాయకులకు సంబంధించి చాలావరకు వెలుగులోకి రాని విశేషాలను ఈ గ్రంథంలో ఆధారాలతో సహా రచయిత పాఠకుల ముందుంచారు.

ఈ గ్రంథంలో పురుషులతోపాటుగా పోరుబాట సాగిన మహిళలకు రచయిత తగిన ప్రాముఖ్యత కల్పించారు. ముస్లిం మహిళలు పర్దా చాటున మాత్రమే ఉంటారన్న అపోహను బద్దలు కొడ్తూ అనేకమంది ముస్లిం మహిళలు బహిరంగ జీవనంలోకి ప్రవేశించి, బ్రిటిష్‌ వ్యతిరేక పోరాలలో పాల్గొనడమేగాక ఇతరులను సయితం ఉత్తేజపర్చిన తీరు-తెన్నులు ఈ పుస్తకంలో చూస్తాం. అవసరం వచ్చినప్పుడు మాతృభూమి సేవల కోసంగాను వ్యక్తిగత బంధనాలను కూడా త్రోసిపుచ్చుతూ మహిళలు కూడా శాంతియుత -సాయుధ పోరాటాలలో పాల్గొన్న వైనాన్ని కళ్ళకు కట్టిటనట్టు రచయిత వివరించారు. బ్రిటిష్‌ వ్యతిరేక ఉద్యమకారులైన మహిళల జీవితాలను పరికిస్తే ముస్లిం మహిళ గురించి ప్రచారంలోఉన్న సంకుచిత భావాలు చాలా వరకు దూరం కాగలవు.

జాతీయోద్యమకారుల చేత 'అమ్మా' అన్పించుకుని, జాతీయోద్యమ స్పూర్తిని రగిల్చిన ఆబాదిబానో బేగం, ప్రముఖ విప్లవకారుడు ఖుదీరాం బోసుకు ఆశ్రయమిచ్చి, తన అసలు పేరుతో కాకుండా 'ఖుదీరాం కి దీదీ' పేరుతో ప్రసిద్ధికెక్కిన ఖుదీరాం కి దీదీ, సింధ్‌-నౌఖాళీ ప్రాంతాల్లో మతకల్లోలాలు చెలరేగినప్పడు, మహాత్ముని ఆదేశాల మేరకు ఆ ప్రాంతాలలో పర్యటించి, హిందూ-ముస్లింల ఐక్యత కోసం కృషి చేయడం మాత్రమే కాకుండాచివరకు 20 రోజులపాటు సత్యాగ్రహ దీక్ష సాగించి గాంధీజీ నిజమైన