పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సంగ్రామంలో పురుషులతోపాటుగా వీరోచితంగా పోరాడిన బేగం హజరత్‌ మహాల్‌, మృత్యువులో సహితం ఝాన్సీరాణిని నీడలా అనుసరించిన ముందర్‌, విలాసవంతమైన జీవితాన్ని వదలి కాన్పూరు అధినేత నానా సాహెబ్‌ పక్షాన చేరి స్వయంగా రణరంగంలో పాల్గొన్న బేగం అజీజున్‌ లాంటి మహిళల స్పూర్తిదాయక కథనాలు వారి చిత్రాలతో సహా ఈ గ్రంథాంలో చోటుచేసుకున్నాయి.

మన రాష్ట్రంలో ప్రజల మీద ఆంగ్లేయులు సాగిసున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజలతో కలసి హైదారాబాద్‌ రెసిడెన్సీ మీద సాహసోపేత దాడి చేసిన పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌, మౌల్వీ అల్లావుద్దీన్‌లను, అంధులైనప్పటికి కడప కేంద్రాంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యం మీద పోరాటానికి పకడ్బందీగా పథక రచన చేసిన షేక్‌ పీర్‌ షా సాహసం గురించిన ఆసక్తిదాయక వివరాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత 28 ఏండ్లకు ఉనికిలోకి వచ్చిన 1885 నాటి భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు హాజరైన రహిమతుల్లా సయాని, జాతీయ కాంగ్రెస్‌కు తొలిదశలోనే అధ్యా క్షపీరం అలంకరిచిన జసిస్‌ బద్రుద్దీన్‌ తయ్యాబ్జీలతో ఆరంభమై ఆ తరువాత సాగిన అహింసాయుత, సాయుధ పోరాటాలలో పాల్గొని స్వాతంత్య్రోద్యమ చరిత్రలో తమదైన ముద్రను స్థిరపర్చుకున్న ప్రముఖుల వివరాలను 'చిరస్మరణీయులు' వెల్లడిస్తుంది.

ఆ తరువాత జాతీయోద్యమ కాలంలో ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన యోధులలో ఖిలాఫత్‌ ఉద్యమ సారదులుగా ఖ్యాతిగాంచిన అలీ సోదరులు, దశాబ్దాలుగా ప్రవాస జీవితం గడిపిన మౌల్వీ ఒబైదుల్లా సింధీ, ప్రవాస భారత ప్రభుత్వ ప్రదమ ప్రదానిగా బాధ్యా తలు స్వీకరించిన బర్కతుల్లా భోపాలి, ఉత్తేజపూరిత ప్రసంగాలతో సభికులను తనవైపుకు ఆకట్టుకుంటూ జాతీయోద్యమంలో 'చిచ్చర పిడుగు' గా ఖ్యాతి గాంచిన మౌలానా హస్రత్‌ మోహాని, గుజరాత్‌లో గాంధీజీ సాగించిన ప్రయోగాలకు నాయకత్వం వహించిన జస్టిస్ అబ్బాస్‌ తయ్యాబ్జీలు లాంటి చిరస్మ రణయులు ఈ గ్రంథంలో తారసపడతారు.

గోవధను నిషేధించాలని కోరిన హకీం అజ్మల్‌ ఖాన్‌, మౌలానా మజహర్రుల్‌ హఖ్‌, సాయుధ పోరాటంలో భాగంగా నాయకుడి కోసం నేరభారాన్నంతా తాను మోసి