పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

109

46. మౌలానా మజహర్రుల్‌ హఖ్‌

(1866-1930)

జాతి జనుల ప్రయాజనాల ముందు స్వజనుల ప్రయాజనాలు తీసికట్టన్నభావనతో స్వరాజ్యం అను స్పష్టమైన లక్ష్యాన్ని సాధించటం కోసం జీవితపర్యంతం కృషి చేసిన స్వాతంత్య్ర సమర యోధులలో మజహర్రుల్‌ హఖ్‌ ప్రముఖులు.

బీహార్‌ రాష్ట్రం, పాట్నాజిల్లా భాపూర్‌ గ్రామంలోని జమీందారి కుటుంబంలో 1866 డిసెంబర్‌ 22న మజహర్రుల్‌ హాఖ్‌ జన్మించారు. 1888లో న్యాయశాస్త్రం అభ్య సించేందుకు ఇంగ్లాండ్‌ వెళ్ళ గా అక్కడ ఆయనకు మహాత్మాగాంధీ సహవిద్యార్థిగా పరిచయమయ్యారు. సేవా దాక్పథం, నిర్మాణ దక్షత గల ఆయన ఇంగ్లాండ్‌లో అంజుమన్‌-ఎ-ఇస్లామియా అను విద్యార్థుల సంస్థను ప్రారంభించి ముస్లిం విద్యార్థులకే కాక భారతీయ విద్యార్థులు అందరికీ ఈ సంస్థను కూడలి ప్రదేశంగాతీర్చిదిద్దారు.

1891లో ఇంగ్లాండ్‌ నుండి తిరిగి వచ్చి న్యాయవాదిగా జీవితం ప్రారంభించిన ఆయన కొంతకాలం తరు వాత జుడిషయ ల్‌ సర్వీసులో ప్రవేశించి 1896లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఛాప్రాలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ఆరంభించారు. ఒకవైపున న్యాయవాదిగా అవిశ్రాంతంగా పనిచేస్తూ పలు సేవా కార్యక్రమాలతో ప్రజలతో సత్సంబధాలు పెంచుకున్నారు. ఆ కారణంగా ప్రజాప్రతినిధిగా ఆయనకు పలు పదవులు లభించాయి.

చిరస్మరణీయులు