పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

అమెరికా నుండి తిరిగి వచ్చాక పూర్తిగా విప్లవోద్యమం బాటపట్టారు. 1909లో జపాన్‌ వెళ్ళి అక్కడ ఆచార్యునిగా పనిచేస్తూ ఇస్లామిక్‌ సౌభ్రాతృత్వంఅను పత్రికను ప్రారంభించి బ్రిటిష్‌ ప్రబుత్వ చర్య లను వ్యతిరేకిస్తూ విప్లవకారుల వైఖరిని సమర్థించ సాగారు. ప్రబుత్వం ఆగ్రహంచటంతో ఆ పత్రిక 1912లో నిలచిపోయింది, ఆయన ఉద్యోగం ఊడిపోయింది. ఆ తరు వాత మళ్ళీ అమెరికా చేరు కుని గదర్‌ పార్టీలో చేరటంతో ఆయన ప్రజ్ఞా పాటవాలను ఎరిగి ఉన్న పార్టీ నాయకులు బర్కతుల్లాకు ఉపాధ్యక్షపదవినిచ్చి గౌరవించారు.

1914 తరువాత బర్కతుల్లా జర్మనీ వెళ్ళి అక్కడున్న విప్లవయోధులు హర్‌దయాల్‌, చంపకరామన్‌ పిళ్ళెలతో లభించిన పరిచయంతో భారత స్వాతంత్య్ర సమితి అను విప్లవ పోరాట సంఘాన్ని స్థాపించడంలో వారికి సహాయపడ్డారు. ఆ సమయంలో ఆయనకు రాజా మహేంద్రప్రతాప్‌తో మంచి స్నేహం ఏర్పడింది. జర్మనీలో కొంతకాలం గడిపాక సంపూర్ణ స్వరాజ్యం సాధన కోసం మిత్రదేశాల సహాయం అర్థించేందుకు టర్కీ వెళ్లారు. టర్కీ అధినత అంవర్‌పాషాను కలిసి సాయుధపోరాటానికి మద్దతు సంపాదించారు. 1915 అక్టోబరు 2న రాజా మహేంద్రవర్మతో కలిసి కాబూల్‌ చేరుకుని, ఆఫ్ఫనిస్తాన్‌ అధినేత హబీబుల్లాతో చర్చలు జరిపి బ్రిటిష్‌ ప్రభుత్వం మీద యుద్దం చేయాలంటే స్వతంత్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నారు. భారతదేశ స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తూ రాజా మహేంద్ర ప్రతాప్‌ రాష్ట్రపతిగా, తాను ప్రధాన మంత్రిగా భారత దేశం ఆవల స్వతంత్ర భారత ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వానికి టర్కీ, జర్మనీ దేశాల గుర్తింపు లభించటంతో హడలిపోయిన బ్రిటిష్‌ పాలకులు ఆఫ్గన్‌ పాలకుల మీద ఒత్తిడి తెచ్చి బర్కతుల్లాను సాగనంపాలన్నారు. ఆ సమయంలో గత్యంతరంలేక రష్యాలో ఏర్పడిన నూతన కమ్యూనిస్టు ప్రబు త్వం సహయాన్ని కోరేందుకు బర్కతుల్లా భోపాలి రష్యా వెళ్లారు. రష్యాలో లెనిన్‌ను కలసి చేయూత కోరినా అక్కడ ఆశించినంత తోడ్పటు లభించక పోవటంతో తిరిగి జర్మనీ చేరుకుని రహస్యంగా పలు పత్రికలు ఆరంభించి, ఆ పత్రికల ద్వారా విప్లవకారులను ప్రోత్సహిసూ, విప్లవోద్యమానికి ప్రజల మద్దతు కూడ గట్టసాగారు.

ఆ క్రమంలో 1927లో బెల్జియంలో జరిగిన సామ్రాజ్యవాద వ్యతిరేక సదస్సుకు హజరై సామ్రాజ్యవాద శకులపై గర్జిస్తూ అపూర్వ ప్రసంగం చేశారు. ఒక వైపు మాతృదేశం విముక్తి కోసం, మరోకవైపు ప్రపంచ ప్రజలకే ప్రమాదకరంగా మారిన సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగానూ అవిశ్రాంతంగా పోరాడిన మహమ్మద్‌ బర్కతుల్లా భోపాలి 1895లో స్వదేశం వదలి వెళ్ళి తిరిగి తన స్వంత గడ్డ మీద అడుగు పెట్టకుండానే 1928 జనవరి 5న జర్మనీలో చివరిశ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌