పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

107

45. ప్రో. మహమ్మద్‌ బర్కతుల్లా భోపాలీ

(1864-1928)

భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అగ్నియుగంగా ఖ్యాతిగాంచిన సాయుధ పోరాటానికి తమ జీవితాలను పూర్తిగా అర్పించిన త్యాగధనులలో అరుదైన అగ్నిశిఖరం మహమ్మద్‌ బర్కతుల్లా భోపాలీ.

మధ్య ప్రదశ్‌ రాష్ట్రం భోపాల్‌లో 1864లో జన్మించిన మహమ్మద్‌ బర్కతుల్లా భోపాల్‌ నివాసి కావటంతో బర్కతుల్లా భోపాలి అయ్యారు. బర్కతుల్లా తండ్రి ఖుద్రతుల్లా. బర్కతుల్లా చురుకైన విద్యార్ధి, ఏకసంథాగ్రాహి. విద్యార్జన పట్ల అత్యంత మక్కువగల ఆయన జ్ఞాన సముపార్జన కోసం 1883లో ఇల్లు వదిలి విశ్వయాత్రకు శ్రీకారంచుట్టారు.

ఆ యాత్రలో బ్రతుకు తెరువుకు పలు ఉద్యోగాలు చేసన బర్కతుల్లా ఉపాధ్యాయుడిగా, పాత్రికేయునిగా పనిచేస్తూ ఉన్నత విద్యకోసం 1895లో ఇంగ్లాడు వెళ్ళారు. అక్కడ దేశబక్తులైన ముస్లిం యువకులతోనూ, స్వదేశీ విప్లవకారులతో కలిగిన పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ ఆలోచనల పర్య వసానంగా ప్రపంచ దేశాల సహకారంతో బ్రిటిష్‌ పాలకులను మాతృదేశం సరిహద్దులు దాటించడమే తన ప్రధాన లక్ష్యంగా ఆయన నిర్ణయించుకున్నారు. ఆ లక్ష్యసాధన దిశగా సాగిన ప్రయత్నాలలో భాగంగా 1903లో అమెరికాకు వెళ్ళి గదర్‌ పార్టీ విప్లవకారులతో పరిచయాలు పెంచుకున్న ఆయన

చిరస్మరణీయులు