పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

సభ్యత్వం స్వీకరించారు. జుగాంతర్‌ విప్లవయోధులు సాగించిన సాయుధపోరాట దళం సభ్యురాలిగా రజియా ఖాతూన్‌ విప్లవోద్యమానికి క్రియాశీలక తోడ్పాటునందించారు.

భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర పుటలలో అగ్నియుగం గా పిలువబడిన సాయుధ పోరాట కాలంలో జుగాంతర్‌, అనుశీలన సమితి, ఆత్మోన్నతి దళం, గదార్‌ విప్లవ దళం, హిందూస్థాన్‌ రిపబ్లిక్ అసోసియే షన్, హిందాూస్థాన్‌ రిపబ్లిక్‌ ఆర్మీ తదితర విప్లవ దళాలలోని విప్లవవీరులు అపూర్వ దైర్య సాహసాలతో, అసమాన త్యాగాలతో భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అగ్నియుగాన్ని రగిలించారు. ఆ సమయంలో ప్రాణాలను తృణప్రాయంగా భావించి పోరుబాట పట్టిన విప్లవ వీరుల సరసన నిలిచి ఆ విప్లవ జ్వాలలను మరింతగా మండించడంలో జుగాంతర్‌ విప్లవ సంస్థ సబ్యురాలిగా రజియా ఖాతూన్‌ తనదైన పాత్రను నిర్వహించారు.

ఆనాడు పరాయి పాలకుల నుండి మాతృదేశ విముక్తికోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి చిరునవ్వుతో బలిపెట్టడానికి సిద్ధమైన, ముక్సుద్దీన్‌ అహమ్మద్‌ (నెట్రకోన), మౌల్వీ గయాజుద్దీన్‌ అహమ్మద్‌, అబ్దుల్‌ ఖాదర్‌ (జమ్లాపూర్‌) తదితర విప్లవ యోధులతో కలసి రజియా ఖాతూన్‌ విప్లవోద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. బ్రిటిష్‌ పాలకవర్గాలు జుగాంతర్‌ దళ సభ్యులను పూర్తిగా మట్టుపెట్టాలని ఒకవైపున తీవ్రంగా ప్రయత్నాలు చేసూ,విప్లవకారుల మీద దాడులు, విప్లవకారులకు అండదడలందిస్తున్న ప్రజల మీదదాష్టీకాలకు పాల్పడుతున్న భయానక సమయంలో కూడా రజియా ఖాతూన్‌ మార్గం మళ్ళకుండా విప్లవబాటను వీడకుండా ముందుకు సాగారు.

బ్రిటిష్‌ గూఢచారుల, పోలీసుల కదలికలను, ఇతర సమాచారాన్ని రహస్యంగా విప్లవకారులకు చేరవేయటం, దళంలోని సభ్యులకు ఆశ్రయం కల్పించటం, ఆహారం, ఆర్థిక, ఆయుధ సహాయ సహకారాలు అందచయటం లాంటి పనులను రజియా ఖాతూన్‌ చాకచక్యంగా నిర్వహించి జుగాంతర్‌ విప్లవ దళం పోరాట చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారు.

ఈ విషయాలను ప్రముఖ చరిత్రకారుడు Santimoy Ray తన Freedom Movement and Indian Muslims, PPH, New Delhi,1993, P.44లో విప్లవోద్యమ పోరాట యోదురాలు రజియా ఖాతూన్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌