పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆచార్య పి.రామలక్ష్మి M.A., Ph.D

చరిత్ర - పురావస్తు విభాగం,

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు

పరిచయవాక్యం


విభిన్న సాంఫిుక జనసముదాయాల మధ్య సంయమనం, సమంవయం, సామరస్యం సాధించాలనుకున్నశక్తులు సకారాత్మక ధోరణిలో కృషి సాగించటం వాంఛనీయం. చరిత్రలోని వాస్తవికతను ప్రజల ముందుకు తెచ్చి ఉమ్మడి కృషి, త్యాగాలలో ఆయా సముదాయాల పాత్రను సవివరంగా, చారిత్రక ఆధారాలతో సహా ప్రజా బాహుళ్యానికి వెల్లడి చేయడం అభిలషణీయమైన చరిత్ర రచనా విధానం. చరిత్రలోని వాస్తవాలు తెలిసి త్యాగమయ పోరాటాలలో నాటి జనసమూహాల భాగస్వామ్యాన్ని తెలుసుకున్న సమకాలీన సమాజంలో సదవగాహన-సద్భావన వృద్థిచెంది సమాజాన్నిఅశాంతికి గురిచేసే ఘర్షణ వెఖరి స్థానంలో శాంతి-సామరస్యం-సౌభ్రాతృత్వ వాతావరణం మరింతగా పరిఢవిల్లుతుంది.

ఈ గ్రంథ రచయిత సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌ సరిగ్గా ఇదే మార్గంలో లక్ష్యసాధన దిశగా కృషి ఆరంభించి, అందుకు చరిత్ర రచనను సాధనం చేసు కున్నారు. ఆ ప్రయ త్నంలో భాగంగా భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింలు నిర్వహించిన మహోన్నత పాత్రను వెలికి తీసి, ప్రతి అంశాన్ని విడమర్చి వివరిస్తూ ఇప్పటివరకు తెలుగులో వెలువరించిన ఏడు గ్రంథాలలో కూడ ఈ లక్ష్యమే స్పష్టమౌతుంది. ఆ కారణంగా నశీర్‌ రాసిన ఏడు చరిత్ర గ్రంథాలలో నాలుగు గ్రంథాలు మూడుసార్లు, మూడు గ్రంథాలు రెండుసార్లు పునర్ముద్రణ పొందాయి.

ప్రస్తుత గ్రంథం చిరస్మరణీయులు కూడా ఆ లక్ష్యసాధానలో భాగంగా రూపు దిద్దుకుంది. ఈ గ్రంథం బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఎదిరించిన ముస్లిం యోదులు, ముస్లిం స్త్రీమూర్తుల గురించి, మానవీయ విలువలకౖెె శ్రమించిన వారి జీవిత ఘట్టాలను సంక్షిప్తంగా తెలియజేస్తోంది. రచయిత ఎంతో శ్రమించి, ఎన్నోఆధారాలను సేకరించి