పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

13 /6-800 15. లైసెన్సు కలిగియున్న వ్యక్తి 7వ పరిచ్ఛేదము క్రిందగాని 14వ పరిచ్ఛేదము క్రిందగాని అపరాధమునకు దోషస్టాపితుడైనయెడల, లైసెన్సు ఇచ్చు ప్రాధికారి ఆ లైసెన్సును ప్రతి సంహరించవచ్చును .

16. (1) కేంద్ర, ప్రభుత్వము, రాజపత్రములో అధిసూచన ద్వారా-

(ఏ) ఈ భాగము క్రింద లెసెన్సును ఏ నిబంధనలకు, షరతులకు మరియు నిర్భంధనలకు. లోబరచి ఈయవచ్చునో అవి ఏవేని ఉన్నచో వాటిని విహితపరచుచు;

(బీ) ప్రజా భద్రత కొరకై చలనచిత్ర ప్రదర్శనలను క్రమబద్దము చేయుట కొరకు నిబంధనచేయుచు,

(సీ) 12వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (3) క్రింద అపీలు ఎంత కాలము లోపల మరియు ఏ షరతులకు లోబడి చేయవచ్చునో విహితపరచుచు,

నియమములను చేయవచ్చును.

(2) ఈ భాగము క్రింద కేంద్ర ప్రభుత్వము చేసిన ప్రతి నియమమును దానిని చేసిన పిమ్మట వీలయినంత శీఘ్రముగా, పార్లమెంటు అధివేశనములోనున్న సమయమున, మొత్తము ముప్పది దినముల కాలావధిపాటు దాని ప్రతియొక సదనము సమక్షమున ఉంచవలెను.. ఆ ముప్పది దినములు, ఒకే అధివేశనములోగాని, రెండు లేక అంతకు మించి వరుసగా వచ్చు అధివేశనములలోగాని చేరియుండవచ్చును . మరియు పైన చెప్పిన అధివేశనమునకు లేక వరుసగావచ్చు అధివేశనములకు వెనువెంటనే వచ్చు అధివేశనము ముగియుటకు పూర్వమే ఆ నియమములో ఏదేని మార్పు చేయుటకు ఉభయ సదనములు అంగీకరించినచో లేక ఆ నియమమును చేయరాదని ఉభయ సదనములు అంగీకరించినచో, అటు పిమ్మట ఆ నియమము అటు మార్పు చేసిన రూపములో మాత్రమే ప్రభావము కలిగియుండును, లేక సందర్భానుసారముగ, ప్రభావ రహితమై యుండును. అయినప్పటికిని, ఏదేని అట్టి మార్పు గాని, రద్దు గాని, అంతకు పూర్వము ఆ నియమము కింద చేసియుండిన దేని శాసనమాన్యతక్కె నను భంగము కలిగించదు.

17. కేంద్ర ప్రభుత్వము, వ్రాతమూలకమ్నెన ఉత్తరువు ద్వారా, ఏదేని చలన చిత్రము యొక్క ప్రదర్శనను లేక ఏదేని కోవకు చెందిన చలనచిత్రముల ప్రదర్శనలను తాము విధించు నట్టి షరతులకును నిర్బంధనలకును లోబరచి ఈ భాగమునందలి ఏవేని నిబంధనల నుండి గాని ఈ భాగము కింద చేసిన ఏవేని నియమముల నుండి గాని మినహాయించవచ్చును.

భాగము

రద్దు

18. సినిమాటో గ్రాఫు చట్టము, 1918 ఇందుమూలముగా రద్దు చేయన్నెనది:

అయితే భాగము 'ఏ' మరియు భాగము 'బీ రాజ్యముల విషయములో, సదరు చట్టము చలనచిత్ర ఫిల్ములను ప్రదర్శనార్దము మంజూరు చేయుటకు సంబం ధించియున్నంతమేరకు మాత్రమే ఈ రద్దు ప్రభావము కలిగియుండును .