పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

6 /6-800 5 - - (1) 6వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (2) లో ఏమియున్నప్పటికిని, కేంద్ర ప్రభుత్వము, ఈ భాగము క్రింద ఇచ్చిన ధ్రువపత్రమును రాజపత్రములో అధిసూచన ద్వారా , తాము సబబని తలచు నట్టి కాలావధిపాటు నిలుపుదల చేయవచ్చును లేక

(i) ఏ ఫిల్ము విషయములో ఆ ధ్రువపత్రము ఇచ్చినారో ఆ ఫిల్మును ధ్రువీకరించిన రూపములో కాకుండ ఇతర రూపములో ప్రదర్శించుచున్నారని, లేక

(ii) ఆ ఫిల్మును లేక. అందలి ఏదేని భాగమును ఈ భాగపు నిబంధనలను గాని ఈ భాగము క్రింద చేసిన - నియమములనుగాని ఉల్లంఘించి, ప్రదర్శించుచున్నారని అభిప్రాయపడినచో, అట్టి ధ్రువపత్రమును ప్రతిసంహరించవచ్చును.

(2) ఉపపరిచ్ఛేదము (1) క్రింద అధిసూచనను ప్రచురించినయెడల, కేంద్ర ప్రభుత్వము , ఆ ధ్రువపత్రమును లేక ఆ ఫిల్ము విషయములో డూప్లి కేటు ద్రువ పత్రములను ఇచ్చినచో వాటన్నిటిని బొర్దుకు లేక సదరు అధిసూచనలో నిర్దిష్టపరచిన ఎవరేని వ్యక్తికి లేక ప్రాధికారికి ఇచ్చివేయవలసినదిగా ధ్రువపత్రమునక్కె దరఖాస్తు, పెట్టుకొనిన వ్యక్తినిగాని, ఆ ఫిల్ములో హక్కులు సంక్రమించినట్టి ఎవరేని ఇతర వ్యక్తిని గాని, ఉభయులనుగాని కోరవచ్చును .

(3) ఈ విషయములో తన అభిప్రాయములను తెలుపుకొనుటకు సంబంధించిన వ్యక్తికి అవకాశమునిచ్చిన పిమ్మటనే తప్ప ఈ పరిచ్ఛేదము క్రింద ఎట్టి చర్య తీసుకొనరాదు.

(4) ఈ పరిచ్ఛేదము క్రింద ధృవపత్రమును నిలుపుదల చేసిన కాలావధిలో ఆ ఫిల్మును ధ్రువీకరించని ఫిల్ముగా భావించవలెను.

5ఎఫ్. (1) ధ్రువపత్రము కొరకు దరఖాస్తు పెట్టుకొనిన వ్యక్తి గాని, ఫిల్ములో హక్కులు సంక్రమించినట్టి ఎవరేని ఇతర వ్యక్తి గాని, పరిచ్ఛేదము 5 క్రింద కేంద్ర ప్రభుత్వము చేసిన ఏదేని ఉత్తరువువలన వ్యధితుడైనయెడల , రాజపత్రములో అధిసూచనను ప్రచురించిన అరవై దినముల లోపల అతడు ఆ ఉత్తరువును పునర్విలోకనము చేయుట కొరకై ఏ ఆధారములపై అట్టి పునర్విలోకనము చేయువలయునని తాను తలంచుచున్నాడో ఆ ఆధారములను ఉగ్గడించుచు కేంద్ర ప్రభుత్వమునకు ఒక దరఖాస్తు పెటుకొనవచ్చును:

అయితే, ధ్రువపత్రము కొరకు దరఖాస్తు పెట్టుకొనిన వ్యక్తి లేక ఆ ఇతర వ్యక్తి, పునర్విలోకనము కొరకు దరఖాస్తును *[1]పర్యాప్తమ్నెన కారణమును బట్టి సదరు అరవై దినముల కాలావధిలోపల పెట్టుకొనలేక పోయినాడని కేంద్ర ప్రభుత్వము తృప్తి చెందినచో అది అట్టి దరఖాస్తును మరో అరవై దినముల కాలావధిలోపల దాఖలు చేయుటకు అనుమతించవచ్చును

(2) ఉపపరిచ్ఛేదము (1) క్రింద దరఖాస్తు అందిన మీదట, కేంద్ర ప్రభుత్వము , ఆకర్షింపబడుటకు వ్యధితుడైన వ్యక్తికి యుక్తమైన అవకాశము నిచ్చియు తాము ఆవశ్యకమని తలంచునట్టి తదుపరి పరిశీలన జరిపిన పిమ్మటను తమ నిర్ణయమును ఖాయపరచుచు, మార్పుచేయుచు లేక విపర్యస్తముచేయుచు తాము సబబని తలచు నట్టి ఉత్తరువును చేయవచ్చును; బోర్డు అట్టి ఉత్తరువుననుసరించి ఆ విషయమును పరిష్కరించవలెను.

6. (1) ఈ భాగములో ఏమియున్నప్పటికినీ, ఏదేని ఫిల్ముకు సంబంధించి ప్రభుత్వ బోర్డు. సమక్షమున నడుచుచున్నట్టి లేక బోర్డు గాని సందర్భానుసారముగ ట్రిబ్యునలు గాని నిర్నయము ఒసగినట్టి ఏదేని చర్య (అయితే టిబ్యునలు సమక్షమున ఏదేని విషయమునకు సంబంధించి నడుచుచున్న ఏ చర్యయు ఇందు చేరియుండదు) యొక్క

  1. *చాలినంత