పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ఘటికాచలమాహాత్మ్యము


క.

యక్షపవితరణునకు హ
ర్యక్షపరాక్రమధురాక్రమాడ్యుకు శశిహ
ర్యక్షపదాంబుజపూజన
దక్షపరప్రథితగుణికిఁ దరుణాగ్రణికిన్.

55


క.

సౌనాశీరి నిశాకర
సూనశరాసన వసంత సుందరునకు సం
ధానవభార్గవునకు మం
ధాన వసుమతీధరేంద్రధైర్యోన్నతికిన్.

56


క.

అక్షీణశ్రీలక్షిత
వీక్షాలబ్ధార్ధసుకవివిశ్రాణితస
ద్రాక్షారస శిక్షాత[1]
దీక్షాలసమానకవనదీవ్యత్కృతికిన్.

57


క.

అతిలలితాతులితగుణా
ద్భుతునకుఁ గుక్షింభరప్రభుంమన్యపణా
యతనయనాజన[2]విటునకు
సతతశుభప్రభవవిధవళతమన్యునకున్.

58


క.

చండ నిజాఖండభుజా
దండ సుజాతప్రతాప తాపన దళితో
దండారిత మస్తతికిన్
[3]ఖండొజిరాయావనీంద్రకమలాపతికిన్.

59


వ.

అంకితంబుగాఁగ నమ్మహాకవి యొనర్చిన ఘటికాచలమాహాత్మ్యంబను మహాప్రబంధంబునకు కథారంభం బెట్టి దనిన.[4]*

60
  1. సవీక్షా. తా.
  2. విభునకు. పూ. ము.
  3. ఖండే రాయాంఘ్రి విమలకమలగమతికిన్
  4. ఈ అవతారికలోని అరువది గద్య పద్యములు మరియు ఆశ్వాసాద్యంత పద్యములు వేంకటగిరీంద్రుడు రచించినవి.