పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవతారిక

13


ప్రబలదిగ్గజములు ప్రతిఘటించినగాని
మొక్కలిజంతయై మూలఁద్రోయు
గరళకంధర హరి పురందర విరించి
సురలు వచ్చిన నొకసన్నఁజూచు నౌర
కఠినవైరులదళమన్న కాసెఁగట్టు
ధరణి ఖండోజిధీరుని ధైర్యలక్ష్మి.

50


ఉ.

మెత్తని పల్కులుం గవులమేలిమి తాలిమిసొంపు కామినీ
చిత్తము నాత్మవిత్తముగఁ జేయుతెఱంగు హితైకపోషణా
యత్తమనీష మంజులతరాకృతి ఖండొజిరాయునందు స
ర్వోత్తమమై చెలంగు ధర నుత్తముఁ జేరిన రిత్తబోవునే?

51


గీ.

అమల ముద్దాజిపుత్రి మానాయిసతియు
నమర నరసాజితనయ వీరాయిసతియు
నతనిచేపట్టి మెఱయుదు రమరనగము
మాలతీమల్లికలువోలె లీల నెసఁగి.

52


మ.

మతి సౌందర్యకళావిలాసనిధులై మా నాయి వీరాయి యు
ద్గతలీలం దను జేరికొల్వగ విశాఖాయుక్తచంద్రుండు నా
క్షితి లక్ష్మీయుతపంకజాక్షుఁ డనఁగాఁ జెన్నొంది ఖండోజిరా
ట్పతి యాచంద్రధరాధరార్కముగ [1]సంపద్దాముఁ డై వర్తిలున్.

58


షష్ఠ్యంతాలు

క.

ఏతాదృగ్గుణగణనా
జాతమనీషావిశేషచతురబ్ధివృత
క్ష్మాతలజనతా[2]వహికి న
శీతలసదఖర్వదోర్వశీకృతమహికిన్.

54
  1. సంపద్ధైర్యుఁడై వర్తిల్లున్. తా.
  2. మహికి నశీతలసర్వదోర్వసీకృతమహికిన్ తా.