పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

ఘటికాచలమాహాత్మ్యము


శా.

ఆ గంగాయినితంబినీమణికి రమ్యాంగుండు కృష్ణాజిభూ
భాగస్వామికి సంభవించెను దురాపస్తంభజన్మాయశ
స్త్యాగార్థంబు జనించెనాగ నరసింహస్వామి భీతారిజా
యాగమ్యస్వభయంకరప్రబలరూపాటోపసంరంభియై.

31


మ.

 అరికిన్ పండ్లిగిలించఁ డెంచఁడు [1]హిరణ్యాదృష్టి మత్తాసుహృ
చ్ఛర దగ్రత చూచికుందఁడు విపక్షచ్ఛేదనాపాదన
త్వర సంధిల్లిన వేళఁ జూడఁడు సముద్యన్మండలాగ్రంబు నే
మరఁ డౌరా నరసాజిరాయఁడు మహామార్తాండసంకాశుఁడై.

32


సీ.

ఝంపాగతప్రాణ శబ్దాయమాన భూ
ధరగుహాకుహర నిద్రా[2]ప్రసక్తి
కటకభూమిరుహాగ్రగళితపర్ణాకీర్ణ
పర్వతాంబుకషాయపానయుక్తి
భరితగండమదాపసురభి గంధగజేంద్ర
ఘటనానిశాఖేట[3]ఘటనయుక్తి
అనుపమానాధిత్య [4]కాతృతాప్రత్యుష
శ్చిత్రభానుప్రభాసేవనంబు
పరుల కర్పించి నిజవీరభటమృగేంద్ర
పాలితము చేసె దత్పురప్రకర మౌర
సంతతారాతినేత్రదురంతతిగ్మ
భావిభుండగు నరసాజిభూవిభుండు.

33


ఉ.

ఆనరసింహపూజనములన్న శివార్చనలన్న ధర్మ[5]దా
నానకు దార మీని కఠినప్రకృతుల్ రణరంగవీథిలో
నానరసింహభూవిభు భుజాయుధవర్ణినిఁగన్న ధర్మదా
నానికి నోడి యిత్తురు [6]సనాతనసంచితమంచితంబుగన్.

34


క.

గురుజాయియందు గనియెం
నరసాజివిభుండు సుతుల నయగుణనిధులన్

  1. హిరణ్యవృష్టి తా.
  2. పసక్తి. తా.
  3. ఖటన. తా.
  4. కార్తతా. పూ. ము.
  5. దానానికి తార మీని తా. దావానకుఁ దార మీని పూ. ము.
  6. సనాతసమంచిత మంచితంబుగన్. తా.