పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

ఘటికాచలమాహాత్మ్యము


దండాలంకృతపాణి వాణి యొసఁగున్ దాక్షిణ్యవారాశి యౌ
ఖండోజిక్షితిపాలచంద్రునకు వాక్కల్యాణపారంపరిన్.

4


శా.

ఆలోలాత్మసకృత్కృతప్రణయగంగాలింగనప్రోల్లస
ల్లీలాభోగి తనూహరిద్రలను హాళింజూచి లోనల్గు నా
ర్యాలీలావతి మానసం బెఱిఁగి యాహారిద్రవర్ణంబు స
వ్యాలోకంబున మాటుశంకరుఁడు కావ్యస్వామినిం బ్రోవుతన్.

5


ఉ.

పుట్టదుపూరి నాతలనుబుట్టినకుంభములందు నీయెదం
బుట్టినకుంభయుగ్మమున బుట్టెసుధారసధార [1]తెల్పు మీ
గుట్టని పోరువెట్టు నలకుంజరవక్త్రునిఁ జూచి నవ్వు నా
గట్టులఱేనిపట్టి దయ ఖండొజిరాయనిఁ బ్రోచుగావుతన్.

6


చ.

గరళశశాంకరేఖలను కంఠశిరంబులనుంచి మించు భూ
ధరతనయాసహాయుగతి తప్పులుగల్గిన లోనణంచి పై
సరసగుణంబుఁగల్గ గడుసన్నుతి సేయు పురాణసత్కవీ
శ్వరకులసార్వభౌములను వర్ణన సేయుడు నెమ్మనంబునన్.

7


చ.

ఝషభషలైన కొన్ని యపశబ్దములం గృతి సెప్పి కామపౌ
రుషముల కాళ్ళు గట్టుకొని రూఢికి నెక్కఁదలంచి శేముషీ
ధిషణులమంచు వాదులకు [2]దీయను కాకవులాడువాక్యముల్
విషకబళంబుగాఁ దలఁచి వీనులఁ బెట్టరు సత్కవీశ్వరుల్.

8


వ.

అని యిష్టదేవతానమస్కారంబును శిష్టకవిపురస్కారంబును దుష్టకవితిరస్కారంబునుఁ గావించి కవిజనవనవసంతుండును కామినీనవీనకేళినీరమణుండును కదనభూతలపరిసంధిసింధురకంఠీరవకులధురంధరుండును కమనీయనిజయశఃకౌముదీసుధాధవళీకృతదిగంతరాళుండును కమలనిలయాసహాయవేణుగోపాలచరణారవిందయుగళభ్రమరాయవి[3]మాణమానసుండును మదీయజనావనబద్దకంకణుండును మదీయసఖుండును మదీయసహోదరకోటిప్రవిష్ణుండును నై పొల్చు ఖండోజి క్షోణీమండలాఖండలుపై బంధురంబుగా నొకానొకమహాప్రబంధంబు రచియింపం బూనియున్న సమయంబున.

9
  1. వేల్పు. తా.
  2. దియ్యను. తా.
  3. మాన. తా.