పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

81


ఆంధ్ర భాషా వాజ్మయములకును జరిగిన మేలుకీడులను పరిశీలించినప్పుడాయన స్థితిగతులిప్పుడున్నట్లుండవు. అతనికృతులు మనకీ విధముగా నర్థ మగుకొలది అతని మన స్సామత భావముల తాకిడినలన నెట్టి ప్రవృత్తికల దైనదియు బోధ పడును. ఈ యుపోద్ఘాతము దదభిముఖముగా నుండుట లషింపబడినది. రామకృష్ణునికృతులమీద పరిశోధనలు చేసిన వారుక లరు ఆంధ్రవిశ్వ విద్యాలమున శ్రీ వేదాంతం గోపాలకృష్ణ మాచార్యులు, శ్రీ ఎక్కిరాల రామకృష్ణ మాచార్యులు, మద్రాసు విశ్వవిద్యాలయమున శ్రీ చిన్నికృష్ణయ్య థీసిస్సులు వ్రాసిరి అమూల్యములును . అపూర్వములును అయిన విశేష విషయములు కొన్ని యైనను ఆథీసిస్సులలో ఉండియుండును. అ )అముద్రి తములు. అందువలన నేను వాటిని చూడ లేదు పై ముగ్గురలో రామకృష్ణుని గూర్చి ఎక్కువ కృషి చేసిన శ్రీఎక్కి రాల రామకృష్ణ మాచార్యులు, శ్రీ చిన్ని కృష్ణ య్య వంటి వారు కొన్ని కొత్త విషయములను చెప్పగల్గ దురు.

నాకు తెలిసిన , నాకు తోచిన కొద్ది పాటి విషయములను ఫలితాంగ ములను పరిగణించుట పెట్టుకొనకుండ వట్టి విషయములుగా నే ఈ యుపో (తమున ప్రతిపాదించినాను. ప్రాచీన కావ్య ప్రబంధ సంపాదకత్వము వహించిన వారు అవి మరియు నర్థ మగుటకు వలయు విషయములను వివరిం చుట, ఆయాకృతుల సాహిత్యపు విలువలను కీర్తించుటకంటెను, అది వారి ప్రథమక ర్తవ్య మను ధర్మమును దృష్టియందుంచుకొని నా నేర్చిన థీయ పోత్గాతమును రచించితిని రామకృష్ణుని కృతుల యర్థముతో సుగత మొనరిం చుట కీనా ప్రయత్నము దోహద మేపాటి చేసినను దీని సాగుదల సార్ధకమై నట్లే లెక్క - ఇందలి గుణ దోషముల సంగతి యెరిగిన వా రెరుగుదురు - సర్వారంభా హి దో క్షణ ధూ' మే నాగ్ని రి వావృతాః [1]|

ఇతిశివమ్

ప్ల వంగ మహాశివరాత్రి 28, ఫి బ్రవరి, 1988

కేతవరపు రామకోటిశాస్త్రి.

  1. 1. శ్రీమద్భగవద్గీత , 18-48.