పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80


ఇంతకును రామకృష్ణుడు వడగల తెగ వాడు కానక్కర లేదని చెప్పుట యైనది. తెంగల తెగ వాడని చెప్పుట కాలేదు, ఆమాట చెప్పినను అదియు కానక్కర లేదని చెప్పవచ్చును. శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు చెప్పినట్లు గా 1[1] “అసలుబుడమే భద్రము లేనిరామకృష్ణుని యా వైష్ణవములో, అది వడగల సంప్రదాయమా, తెంగల సంప్రదాయమా అను ప్రశ్న వట్టి వినోదము మాత్రమే"

26. రామకృష్ణుడు సురారామగజము :


తెనాలి రామకృష్ణుడు చాలజాగ్రత్తగా శ్రద్ధాసక్తులకలిమిని సమీక్షించవలసిన ప్రౌఢకవి శేఖరుడు. అతని గురించి ఎవరేమి చెప్పినను ఒక్క పాండురంగ మాహాత్మ్యమును పట్టుకొనియే చెప్పుదురు. మిగిలిన వానికృతు లందుబాటులో లేక పోవుటయు నందుకొక కారణము కావచ్చును. ఆంధ్రభాషాకవులలో ప్రతిభావ్యుత్పత్తులచేత నేగాక మత తాత్త్విక భావముల చేతను రామకృష్ణుడు విలక్షణమైన వాడు. ఆయన మూడుకృతులను కూలంకషముగా అధ్యయనము చేసినగాని ఆయన లోతుపాతులు తెలియవు. వైష్ణవగ్రంథములు రెండును ఇప్పుడందుబాటులో నున్నవి. శైవగ్రంథముగూడ ఇట్లే రావలయును. మూడు కృతులమీద రామకృష్ణుని అధ్యయనము చేయుటకు వలయు భూమికగా కూడ వనికి రావలయునని ఈ యుపోద్ఘాంతము వ్రాయ బడినది. -

రామకృష్ణుని జన్మతోడిది శైవమనియు అతనియెడ వైష్ణవముశిధిల మైనది యనియు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు,[2] శ్రీమాన్ రాళ్ళ పల్లి అనంతకృష్ణశర్మగారు[3] చెప్పిన వాక్యార్థములను రామకృష్ణునికృతులను ముందు పెట్టుకొని ఋజువు చూచుకొనుటకు మొదలు పెట్టినచో ఇంతకు పూర్వము మన కపరిచితములయిన రామకృష్ణుని బుద్ధి భూముల నిమ్నోన్నతముల మంచి చెడ్డ లవగతములగును. అతడు క్రొత్తగా కనిపిం చును. అతని అసలుమూర్తి ఇంతవరకు మనకు తెలిసినది కాదనిపించును. రామకృష్ణుని కావ్యతత్త్వవిచారము చాల దొడ్డది. మరియు నీఘటికాచల మాహాత్మ్య ము బహురసాలు కార భావనానార్థ విభాసురంబు (3-68) అని చెప్పినాడు. మరి ఆ ఈ కొలతలతో ఆతని కృతులు కొలువబడినప్పు డెట్లుండునో చూడవలసియున్నది. శైవ వైష్ణవముల వలన రామకృష్ణునకును.

  1. 1. పాండు. (సా) ఉపోద్ఘాతము పుట. 18.
  2. 2. తెలుగు విజ్ఞాన సర్వస్వము. పుట. 1002.
  3. 3. పాండు (సా) ఉపోద్ఘాతము. పుట. 17.