పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

79

 వడగల వారిది మర్కటకిశోర న్యాయము ననుసరింపగా తెంగల వారి దృష్టి మార్జాల! కోర న్యాయము వైపుపోయినది. కర్మ జ్ఞానభక్తి యోగములను పాటింప లేని వారికి అంతకంటే సులభోపాయము ప్రవత్తి అని వడగల వారనగా అది కాదు- లేని వాడు, కల వాడు అన్నది లేదు. సర్వులకును ప్రప త్తియే శరణ్యమని తెంగల - వారందురు. మరియు ప్రపత్తి యే మొదట చేయదగిన దనియు నందురు. 1[1] శ్రీ మద్రామానుజుల మతమే కొంత బ్రాహ్మణమతము. ఆకొంత నింకను పెంచి పెద్ద చేసినది వడగల తెంగల వారట్లొప్పుకొనరు. సర్వవిధములను సర్వులు సమానులన్నది వారి మతము. ఈ విధముగా నిరువు రకును పదు నెనిమిది ప్రధాన భేదము లున్నట్లు తెలియుచున్నది,

రామకృష్ణు డీరెండింటిలో నేశాఖయం దభిమానము కలవాడు? ఈ విషయమున ఇది యని చెప్ప లేము. అనుమానముమీద తెలిసికొనుట కైనను అవ కాశములు మృగ్యములుగా నున్నవి. (1) తిరువారాధనములో తెంగల శాఖవారు గంట వాయింపనంత మాత్రమున పుండరీకుడు బడిఘంట మొరయ జేసినట్లు (2_22) రామకృష్ణుడు వ్రాసినందున వడగల తెగ వాడు కానక్కర లేదు. స్మార్తుల దేవతార్చనమునను గంట వాయింపుడున్నది. ఆ పూర్వస్మృతితో పాండురంగ మాహాత్మ్యమున ఆయన అట్లు వ్రాసియుండ వచ్చును ఎట్లును శిధిల వైష్ణవ మేకదా అతనిది? మరియును కొంత వైష్ణవము ముదిరినపిమ్మట వాసిన ఘటికాచలమాహాత్మ్య మున గంట వాయింపసలు లేకుండనే చేసినాడు. మరియిక్కడ ఏ తెగ వాడుగా చెప్పవలయును? (2) ఖండోజికి ఈ ఘటికాచలమాహాత్మ్యమును తీసికొనిపోయి ఇచ్చిన రామ కృష్ణునిమనుమడు' వెదు రాకువంటి తిరుమణి నుదుట ధరించినటు చెప్పబడి యున్న దానినిబట్టి (అవతారిక . 12) రామకృష్ణుడు వడగలయనుట పై దానంత సులభముగా త్రోసి వేయదగినది కాదు. ఆ “రామకృష్ణునిమనుమడు” సరిగా రామకృష్ణుని కూతురు కొడుకో, కొడుకుకొడుకో కాదు. రామకృష్ణునకు నూరునూట యేబది సంవత్సరముల తరువాత ఆవంశము లోని వాడవని చెప్పుకొన్న వాడు. వాడు పెట్టుకొన్న బొట్టును పట్టుకొని వానితాతముత్తాతల మత భావములను నిశ్చయించుట కుదురదు. అమాంతము మతములను మార్చుకొన్న వంశములో పురుషాంతరములమీద మరెవ్వరును మార లేదని అనుకొనుట యెట్లు ? అది కారణముగా ఆ మనుమని వెదురాకువంటి తిరుమణి రామకృష్ణుని వడగల శాఖకు చెందుటకు ఋజువు కాదు.

  1. 1.V. S. P. 56.