పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3


3. రామలింగ రామకృష్ణు లభిన్నులు :

ఉద్భటారాధ్య చరిత్రము వ్రాసిన రామలింగమును, పాండురంగ మాహాత్మ్యమును వ్రాసిన రామకృష్ణుడును పేర్లను బట్టియు, గురువులను బట్టియు, బిరుదములను బట్టి యు, గ్రంథ తాత్పర్యములను బట్టియు ఖిన్ను లని యొక వాదమున్నది. తల్లి దండ్రులను బట్టియు, కులగోత్రములను బట్టియు, మరియు తెనాలి వంశము వారైన కవుల సాథ్యములనుబట్టియు వారిరువురును ఒకరే యగుదురని దానికి ప్రతి వాద మున్నది. మరియు నీ ప్రతివాదమున రామకృష్ణుడు మొదట శైవుడై రామ లింగమను పేర ఉద్భటారాధ్య చరిత్రమును రచించి, ఆ పిమ్మట వైష్ణవుడై రామకృష్ణుడను పేరు పెట్టుకొని పాండురంగ మాహాత్మ్య ఘటికాచలమాహాత్మ్యము లను రచించెననియు, అందువలన నే గురువుల పేర్ల లో భేదము కనిపించు చున్న దనియు, చిన్న తనమున కుమార భారతి యైనవాడు పెరిగి పెద్ద వాడు కాగా శారదాకృతి యైనాడ నియు. అందువలన రామలింగ రామకృష్ణు లొక్కరే యనియు సిద్ధాంతము రూపొందింపబడినది.


తెనాలి రామలింగమని మరియొక తెనుగుకవి “ ధీరజనమనో (విరా జిత) రంజనము" అను కృతిని రచించిన వాడు గలడు. ఆయన విశ్వ, బాహ్మ్మణుడు. తెనాలి రామకృష్ణునకు గల రామలింగమను వేరునకును , ఆ విశ్వబాహ్మణకవి పేరునకును ఆ పేరుకు మించి మరెట్టి సంబంధమును లేదు. బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి, గారును 1[1] , చాగంటి శేషయ్య గారును 2[2] మొదలయిన పండిత పరిశోధకు లింతకుమునుపే రామలింగ రామ కృష్ణుల ఏకత్వమును నిర్ణయించి పెట్టి పోయినారు. ఇప్పు డావిషయమున క్రొత్తగా చెప్పదగిన దేమియు కానరాదు.

4. రామకృష్ణుని కృతులు - ముందువెనుకలు :


రామకృష్ణుని కృతులు మూడు లభించుచున్నవి. మొదటశైవుడుగా నున్నపుడు ఉద్భటారాధ్య చరితమును రచించినాడనుటలో తగాదా లేదు. వైష్ణవుడై రచించిన పాండురంగ మాహాత్మ్య, ఘటికాచలమాహాత్మ్యము లలో ఏది ముందై యుండునన్న ప్పుడే అభిప్రాయ భేదములు . పుట్టట మొద

  1. 1. ఉద్భటారాధ్యచరిత్ర పిఠిక ,
  2. 2. ఆంధ్రకవితరంగిణి సంపుటము 8, పుట 8.