పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2


రామకృష్ణుడు జీవించియన్న కాలము నొక్క విధముగా సాహిత్య చరిత్రకారు లoగీక రించుట లేదు. అందువలన శ్రీకృష్ణ దేవరాయల వారి యాస్థానమున కవులలో నీతడొకడై యుండుటయు వివాదాస్పద మైనది. శ్రీ చాగంటి శేషయ్యగారి నిర్ణయము ప్రకారము 1[1] రామకృష్ణుని జనన కాలము " కీ.శ 1495-1500 సంవత్సరముల నడుమ. ఉద్భటారాధ్యచరిత్ర రచన క్రీ.శ 1525 - 1580 సంవత్సరములనడమ , పాండురంగ మాహా త్మ్యము 1550 ప్రాంత రచన. ఘటి కాచలమాహాత్మ్య రచన 1580 ప్రాంతము. 1566 -1570 సంపశ్సరముల మధ్య ఆయన పరమపదించి యుండ వలయును. మరియు రామకృష్ణుడు శ్రీకృష్ణ దేవరాయల యాస్థానములోని అష్ట దిగ్గజకవులలో నొకడు. 2. ఆంధ్రకవితరంగిణి సం. 7. పుట 144. </ref> డాక్టరు నేలటూరి వేంకటరమణయ్యగారి పరిశోధనము ననుసరించి3ఉల్లేఖన లోపం: <ref> ట్యాగుకు, మూసే </ref> లేదు.. వాజ్మయ వ్యాసమంజరి పుట 115.</ref> ఉద్బటా రాధ్యచరిత్ర రచనము 1520 ప్రాంతము. పాండురంగ మాహాత్మ్యము కృష్ణ రాయల వారి రాజ్యకాలము తుదనో తరు వాత అచిరకాల ముసనో విరచితమైయుండవలయును. 4 అనగా 1525 - 1540 సంవత్సరముల ప్రాంతము. 5[2]


శ్రీ వీరేశ లింగము పంతులుగారి వద్ద నుండి కవిచరిత్ర కారులును , వాజ్మయ చరిత్ర కారులును , పరిశోధక పండితులును ఎక్కువమంది కొద్ది పాటి కుడి యెడమల మీద ఈ పైన చూపబడిన కాలనిర్లయ మే నిర్లయ ముగా భావించు చున్నారు. *[3] రామకృష్ణు) ను పదునారవ శతాబ్దము కవి శ్రీష్ణ దేవరాయల వారి యాస్థానము నందలి యష్టదిగ్గజములలో నొకడు అయినచో వయస్సుచేత కొంత చిన్న వాడై యుండవచ్చును.

  1. 1. ఆంధ్ర కవితరంగిణి సం. 8 పుటలు 8-10-25.
  2. 5. వాజ్మయ వ్యాసమంజరి పుట 149.
  3. * ఈ విషయమున ఎవ రెవ రేమి చెప్పినదియు. ఆ చెప్పబడిన దాని సత్యాసత్య వివరణమును, సిద్ధాంతవిషయప్రతిపాదనమును శ్రీ నేలటూరి వేంకటరమణయ్య గారి వ్యాసములయందు సుష్ఠుగా నున్నది. చూ, వాజ్మయ వ్యాసమంజరి.పుటలు 941-58.