పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

ఘటికాచలమాహాత్మ్యము


సీ.

భూషణ[1]ప్రవిలిప్తభూరిమణిప్రభా
కోటి దిక్కోటుల గుమురుగట్ట
ముత్యాలగొడుగుల మొలుచుడాల్ వెన్నెల
మొత్త మాకస మెల్ల ముంచికొనఁగ
చామరంబులువీఁచు చామ కరంబున
హేమకంకణరవం బింపుఁగులుక
పటహ భేరీ శంఖ పణవ మర్దళ ముఖ్య
వాద్యధ్వనుల్ దిశావలయమద్రువ
నందలంబులు పల్లకీ లశ్వములును
సామజంబులు నెక్కి యుత్సాహ మొదవ
నవనినాయకు లేతెంచి రచ్చటికిని
సరసిజాక్షుని పరిణయోత్సవముఁ జూడ.

59


సీ.

వ్యాసాది సంయమివర్గంబుతోఁగూడ
వాధూల సంయమీశ్వరుఁడు వచ్చె
వీణలు ధరియించి గాణ లేతెంచిరి
దేవలోకమున వర్తించువారు
నిటలోర్ధ్వపుండ్రంబు నీర్కావులు ధరించి
యరుదెంచి రఖిలాగ్రహారజనులు
[2]గొన్నన గొల్లెన కొల్లారు బండ్లును
తేనె నేయును నూనె తిలలు పెసలు
గుడము జీరకము హరిద్ర గోధుమలును
వరుగు వడియంబు లల్లంబు వరుసఁ గొనుచు
వణిజులును బేరివారును గణన మీఱి
వచ్చి రద్దేవదేవు నుద్వాహమునకు.

60


క.

అంతట వైఖానసు ల
త్యంతసదాచారు నొకని నన్వయ[3]వృద్ధున్
శాంతుని నాచార్యునిఁ గా
వింతమని యొనర్చి రట్ల వేదోక్తవిధిన్.

61
  1. ప్రత్యుప్త. తా.
  2. గొనలు. తా.
  3. వృద్ధున్. తా.