పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము

1. రామకృష్ణుని స్వవిషయము : |

తెనాలి రామకృష్ణుడు తనను గూర్చియు తన కుటుంబమును గూర్చియు కొంత సమాచారమును తన కృతుల యవతారికలలో తెలిపి యున్నాడు. మొట్టమొద టికృతియైన ఉద్భటారాధ్య చరిత్రమునను(1-24). రెండవది యైన పాండురంగ మాహాత్మ్య మునందును (1-17, 22, 23, 24) ఆ సమాచారవివరము లున్నవి. వాటినిబట్టి మనకు తెలియవచ్చు. విశేషము లివ్వ:


ఉద్భటా రాధ్య చరిత్రను వ్రాసినప్పటి రామకృష్ణుని పేరు రామ లింగము. కౌండిన్యసగోత్రము వాడు. పాలగుమ్మి ఏలేశ్వర పదపయోజద్వ యీధ్యాన ధారణ సముదాత్త చిత్తుడు. యజుర్వేద వేది. రామేశ్వర స్వామి రమణీయకరుణావి శేష పోషిత విలసిత సమగ్ర సహజసాహిత్య మాధురీ సంయుతాత్ముడు. లక్కమాంబకును రామధీమణికిని పుత్రుడు. పాండురంగ మాహాత్మ్యమునను ఈ చెప్పబడిన వివరములే చెప్పబడియున్నవి. తల్లి పేరు మాత్రము లక్ష్మమ అని ప్రకృతిరూపముననున్నది. మరియు శ్రీగురుమూర్తి పేరు భట్టరు చిక్కాచార్యు లనియున్నది. ఉద్భటా రాధ్య చరిత్ర గద్యమున గల “కుమార భారతి" బిరుదము పాండురంగమహాత్మ్య మున "శారద రూపము”గా మార్పు చెందియున్నది

2. అతని దేశకాలములు :

రామకృష్ణునకు గుంటూరు జిల్లాలోని తెనాలితో సంబంధమున్నది. అది ఆయనకు ఇంటి పేరుకూడ అయినది. మరియు తననుగురించి తెనాలి అగ్రహార నిర్ణేత యని చెప్పుకొనెను. 1 ఈయన్నింటినిబట్టి రామకృష్ణుడు తెనాలివాడనియే అనుకొన వలయును. రామకృష్ణునితండ్రి తెనాలిలోని రామలిం గేశ్వరస్వామిభ క్తుడై ఉత్సవ విగ్రహమును చేయించియుండుటను బట్టియు వారిది తెనాలి. యనియే చెప్ప వలయును అంతకు పూర్వము వారు గార్ల పొడులో నున్నను 2 మ రెచ్చటనున్నను రామకృష్ణుడుమాత్రము తెనాలి వాడు. 1. పాండురంగమాహాత్మ్య ము 1-28. 2. ఆంధ్రక వితరంగిణి సంపుటము 8. పుట 31.