పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

ఘటికాచలమాహాత్మ్యము


విసరత్కేసరజటాజాల పరికల్పిత నభోలక్ష్మీగృహవదనమాలికాలం
కారుండును, లంకారమణకుమార భయంకర బిరుద హాటకకశిపు
నిశాటవక్షఃకవాట పాటన[1]కుఠారకఠోరనఖర ప్రకరుండును, కరా
నీత దిక్కరీంద్రప్రయుక్తమందాకినీజలసారశీకరసమాప్లుత[2]విష్టపత్ర
యుండును, త్రయీవిభవస్థావరకేంద్రాగ్నివరుణవాయుమనుముని
వసు పరమేష్ఠిహరుండును, హర[3]జహాతిఫరితోభి[4]ధాన ధానవక్షోభ
కారిభుజాయుగళుండును, యుగపత్ప్రవృత్త విశ్వావసు తుంబురు
నారద ప్రభృతి దివ్యగాయనగీత నిజనామాంకిత బిరుదావ ళ్యుదా
హరణ మంగళాష్టక దండకాదిప్రబంధసంరంభుండును, రంభాద్య
ప్సరః ప్రపంచిత నృత్తసమానకాలీన పారిజాతప్రసూనవర్ష దివ్య
దుందుభిధ్వానుండును నై శ్రీనరసింహదేవుండు ప్రత్యక్షంబైన.

249


క.

భయమును కంపంబును వి
స్మయమును సంభ్రమము చిత్తసమ్మోదము భ
క్తియు ముప్పిఱిగొనఁ బ్రణతులు
నియతిం గావించు ఘటిత నిటలాంజలులై.

250


వ.

ఇట్లని స్తుతియించిరి.

251


సీ.

సంత్యక్తమదమానజనశ్రేష్టదానమం
దారకాయ! తమోవిదారకాయ!
ప్రాగ్భవార్జిత మహాపాతకాంబుధర ప్ర
భంజనాయ! సురారిభంజనాయ!
మఘవదాదిముఖాదిమకుటాగ్రరత్న నీ
రాజితాయ! దయావిరాజితాయ!
[5]భక్తభాషితరమాపతిసమస్తాత్మతో
ద్ధారకాయదరారి[6]ధారకాయ
ప్రణతిమభినుతిమహితార్చాం ప్రపత్తి
మంజలీం శరణాగతిం ప్రార్థనాంచ
తన్మహేకుర్మహేవిదద్మఃసమర్ప
యామహేదద్మయిమయేదయామహేచ.

252
  1. కుఠారత్కఠోర. పు. ము. తా.
  2. విగ్రహుండును. తా.
  3. జహీతి. తా.
  4. దానవక్షోభటవిక్షోభకారి. తా.
  5. ఈపంక్తి అర్థము విచార్యము.
  6. దారకాయ. తా.