పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

97


కరుణారసోదీర్ణ కర్ణాంత విశ్రాంత
రవిచంద్ర[1]రూప నేత్రములవాని
చరణసేవక జలాదర విభావక విక
స్వర విభాస్వర ముఖాబ్దంబువాని
అసమాన శృంగారరసమాన కౌస్తుభ
లసమాన వక్షస్థలంబువాని
[2]తరణిబింబభ్రమానువిధాయి నూత్న
రత్న[3]మకుటాభిరమ్యశిరంబువాని
దేవతాచక్రవర్తిని దివ్యమూర్తిఁ
గాంచి సేవించి యప్పారి[4]కాంక్షిపరులు.

229


క.

రాజిల్లుచున్న యప్పుర
రాజము వెల్వడుచు ముందరంజనిచని భూ
యోజనయోగమ్మున ము
య్యోజనములుగడువ నచట నూర్జితమహిమన్.

230


సీ.

పనస నింబ కదంబ పాటలీ ఘనసార
సహకార ఖర్జూర మహిరుహముల
కుంద మందా రాబ్జ కుంజర మాలతీ
మల్లికావల్లీ మతల్లికలను
సర్వర్తు గుణయోగ సంతత ప్రస్రవ
త్ఫలరస మకరందజల ఝరముల
సహకార పల్లవాస్వాద కషాయిత
కంఠ కోకిలకుహూకారములను
విగతవైర పరస్పర విహరమాణ
హరి కరి వ్యాఘ్ర [5]గో బిడా లాఖు శిఖ భు
జంగమ ప్రముఖానేక జంతుసమితి
[6]చే నిరంతర పరిపూర్ణమైనదాని.

231
  1. రూఢ. పూ. ము.
  2. తరుణి. తా.
  3. మకుటి. తా.
  4. కాంక్ష. తా.
  5. మృగ. తా.
  6. శనినీరంతర. తా. తో. నిరంతర. పూ. ము.