పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

ఘటికాచలమాహాత్మ్యము


చ.

అలరుల తోటలన్ మణికృతాచలకాంచనసౌధవాటులన్
జిలుకల మాటలన్ రసము జిల్కెడు చెల్వల యాటపాటలన్
గొలకుల తేటలన్ గళలు గుల్కు చతుర్విధగేహకోటులన్
గలిమిపొలంతి కీపురము కాపురమై విలసిల్లు నిచ్చలున్.

223


క.

కాంతలు నవ రతికాంతలు
కాంతలు సరసీజ[1]కాంతకాంతలు లీలా
కాంతలు కళాతికాంతలు
కాంతా! కనుఁగొంటె నేఁడు కనుపండువుగన్.

224


క.

అనివల్క వసిష్ఠమహా
ముని తక్కిన యార్వురును బ్రమోదంబొదవన్
గనుగొని పురవిభవంబున్
వినుతించి రుదంచితాతివిస్ఫుటపణతిన్.

225


క.

అంత ననంతానంతా
నంతఫలశ్రీలఁ జూచినంత నొసఁగు న
[2]త్యంతము నరులకు నట్టియ
నంతసరోవారి తీర్థమాడి మునీంద్రుల్.

228


ఉ.

నిక్కంపుభక్తి నెక్కొనిన నెమ్మది సమ్మదమెక్కఁ జొక్కుచున్
దక్కిన యైదు తీర్థములఁ దానములాడి ముకుందుఁ బాడి యా
చక్కి బడేడు రూపముల సాములకుం ప్రణమిల్లి కోరికల్
రక్కొనఁజేయు శ్రీవరదరాజులఁ గొల్వగఁ జేరి చేరువన్.

227


గీ.

వేగవత్యుత్తరతటాగ్రభాగ గణ్య
పుణ్యకోటి విమానవిస్ఫుట విధాతృ
యజ్ఞవేదిఁ బ్రసన్నుడై హస్తిశైల
మున వపాగంధముఖతచేఁ దనరువాని.

288


సీ.

తత శంఖ చక్ర గదా వరదానాభి
నయశోభి భుజచతుష్టయమువాని

  1. శాంత. పూ. ము. తా.
  2. భ్రాంతము. పూ. ము. తా.