పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

ఘటికాచలమాహాత్మ్యము


ననయంబున్ బవళించియుండు నల దైత్యారాతి తన్నాభికా
వనజాతంబుగతిన్ మణీవరణభావం బిందు నింపొందఁగన్.

208


క.

తిరుగున్ సురాలయమ్మున
బరగున్ తత్సేవ శుక్రపరిభావమునన్
జరియించునంచు గురునిన్
నిరసింతురు విప్రులిచట నీరజనయనా!

209


సీ.

గురుతరార్యామోదకర నిరూఢి వహించి
నిరత శౌర్యాసంగగరిమఁ గాంచి
ధర్మరక్షణకళాదర సమున్నతిఁ జెంది
దినదినాభ్యుదయవర్తనల నొంది
దీర్ణ నానా సద్యుతిప్రచారత మించి
ద్విజరాజ పోషణాదృతిఁ జరించి
అతిదుర్నిరీక్ష్య భాసిత తేజమునఁ బొల్చి
పంకప్రభంజన ప్రతిభ దాల్చి
రాజసమ్మునమీఱి విభ్రాజమాన
కరసముద్దండ మండలాగ్రప్రభిన్న
పరతమస్తోములగుచు నిప్పట్టణమునఁ
దనరుదురు వేడ్క రాజమార్తాండులబల!

210


చ.

అనవరతంబు నెచ్చెలి దిగంబరియై బికిరంబులెత్తఁ దా
ధనదుఁడనంచు నెక్కనొకతట్టువయైననులేక మానిసిం
బనిఁగొనె కల్మికల్మికిదిమార్గముగాదని యెంచి మించి కై
కొనరు కుబేరు మేటి ధనకోటిని మీటగు [1]వీటి కోమటుల్.

211


గీ.

శ్రీకరవ్యాప్తి నుద్యత్రసిద్ధిఁ గాంచి
విబుధలోకైక సేవాభివృద్ధి మించి
పుట్టినిల్లెన హరిపదాంబుజము వోలి
సొంపు వహియించు నివ్వీటి శూద్రకులము.

212
  1. నట్టి. పూ.ము.