పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

ఘటికాచలమాహాత్మ్యము


లలరె మా ముఖముల ఫలములు ఫలించె
[1]వినుతతారాచలాధీశ! వేంకటేశ!

188


క.

అనుచుం గొనియాడి పునః
పునరాచరిత [2]ప్రణామముల నెంతయు నిం
పొనరించుచుఁ దదనుగ్రహ
వనితామోదానుభావపరవశులగుచున్.

187


వ.

ఎట్టకేలకుఁ దన్మందిరంబు వెలువడి యాగట్టుఱేనిం గనుంగొని.

188


గీ.

భానుకోటిప్రభల దీలుపఱుచు తఱుచు
జేగురులుగల శిఖరముల్ చెంతనున్న
యంబరంబును కాయమానంబు దాల్చు
మణిమయస్తంభములువోలె మలయు నిచట.

189


గీ.

ఇన్నగము మిన్నుమోచినశృంగములు ఫ
ణాసహస్రముకరణిఁగన్పట్ట ధాతు
రాగయుత తారకలు తదగ్ర[3]మణులౌచుఁ
దనరఁ దన శేష సంజ్ఞ సార్థముగఁ దెలుపు.

190


గీ.

కుసుమ కోరక రాజి నింపెసఁగు భూజ
శాఖ లలలారు మిగుల నీ శైలభర్త
కదిసియుండెడు గగనంబు [4]కడకు నెత్తఁ
బూను మౌక్తికభూషణభుజములట్లు.

191


గీ.

అచల మిది ముక్తిసతిచేతి యలరు జంతి
పాప కదళుల నిలఁగూల్చు భద్రదంతి
యీప్సితార్థ రసమ్ములనీను సురభి
సంయమీంద్రకులా[5]వనీజాతసురభి.

192


క.

ఈ శైలవిభవం బీ
దేశికసౌభాగ్య మీసుతీర్థ మహత్త్వం

  1. వినత. తా.
  2. ప్రమాణమము. తా.
  3. రమణులయిన యితన తనశేషసంజ్ఞు సార్థములు. తా. రమణులయి. పూ. ము.
  4. కడకు. తా. కడమ. పూ. ము.
  5. వన. పూ. ము.