పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

87


సీ.

భువనముల్ పుట్టింప పోషింప నణగింప
కర్తయైన ప్రధానమూర్తి వీవ
మస్తకముఖ్యసమస్తాంగ బహులత
లక్షింపఁ దగు జగత్కుక్షి వీవ
కొలుచువారలకును గోరికల్దయసేసి
రాజిల్లు వేల్పుల రాజ వీవ
అజుఁడు రుద్రుఁడు నింద్రుఁడాదియౌ దేవతల్
నిజ మెఱుంగని బోధనిధివి నీవ
తలఁపుపండని తాపసావలికిఁ జూడ
నలవిగానట్టి [1]బ్రహ్మపదార్థ మీవ
శంఖ చక్ర గదా ఖడ్గ శార్ఙ చాప
భూరి విస్ఫూర్తి కీర్తిత భుజుఁడ వీవ.

184


క.

విబుధులకు విబుధభూజము
విబుధారిసమూహములకు విషభూజమునై
[2]యబలుల కెల్లను బలమై
ప్రబలు మహామహుఁడవీవ పంకజనాభా!

185


సీ.

తులసిఱేకులనైన దూర్వలనైన[3]ను
జలములనైన కంజములనైన
పూని [4]నిన్నీశ్వరుఁ బూజించు నామహా
మహులకు ఇళూరు నిహ పరములు
నీ మహామహిమము నెఱిఁగినవారలు
[5]ధన్యులైవర్తింత్రు ధరణియందు
కంజాసనాదులు గనలేని వేదమం
జీరుని నిన్ను వీక్షింపఁగలిగె
గాన భవవార్ధి దాటఁగాఁగంటి మభవ
మా భవములెల్ల నీడేరె మా జపంబు

  1. బ్రహ్మదేదీయునీవ. తా. బ్రహ్మంబు వెలయనీవ. పూ. ము.
  2. యబలల. తా.
  3. ను జ్వలజలజాతబిల్వములనైన. పూ. ము.
  4. విఘ్నేశ్వరుఁ బూజింతురా. తా. పూ. ము.
  5. నే ధన్యులైన తారెత్తగలరె. తా. పూ. ము.