పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

ఘటికాచలమాహాత్మ్యము


సీ.

అభివాదనము వృషభాఖ్యమహాహార్య
[1]దివ్యకూటాగ్రవాస్తవ్యునకును
దండంబు గరుడాభిధానశైలమణీవి
భాసమానానూనభవనభర్త
కంజలి శేషనామాధికధరణీధ
రాధిత్యకాగృహమేధిమణికి
వినతి శ్రీవేంకటవిఖ్యాతనామధే
యాచలహేమగేహకులపతికి
చిన్నిపూ వంజనాద్రిప్రసిద్ధ నిధికి
శరణు గుహసరసీకేళిసక్తమతికి
మోడ్పుగేలు త్రిమూర్తుల మొదలిదొరకు
వెండియు జొహారు వినతవేదండునకును.

181


సీ.

సర్వేశ! సర్వాత్మ! సర్వగుణాతీత!
సర్వజనావన సదయహృదయ!
గోపాల గోపాలగోపనధౌరేయ!
గోగోపగోపికా భాగధేయ!
వారణదైన్యనివారణ! వారణ
శిక్షణదక్షిణ సింహశౌర్య!
శేషాచలేశ! యశేషలోకనివేశ!
శేషశరీరవిశేషతల్ప!
నీలనీరదనీలవినీలగాత్ర!
తీర్థ తీర్థ మహాతీర్థ తీర్థపాద!
నందనందన! సనకసనందననుత!
శరణు శరణయ్య శరణార్ధికరణచరణ.

182


మ.

సవరక్షాచణ సామగేయపద [2]భాస్వత్పీతకౌశేయరూ
పవరేణ్యా సుచరిత్ర సూరిజనభావ్యా సేవనాసక్తవా
సవముఖ్యామరసైంధవత్పతగరాజా సోమవాణీశసం
స్తవ సౌమ్యాత్మక సంగదూరతర సర్వప్రాణిసంరక్షకా.

183
  1. నవ్య పూ. ము. తా.
  2. భాస్వద్వీపశీతేశ రూ. తా.