పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

85


శుభగుణావాలు నిర్జరస్తుతి విశాలు
వితత కరుణాని[1]ధీశు శ్రీవేంకటేశు.

173


సీ.

మొల[2]కటారపుఁడెక్కుగలవాని గలవాని
నెనరువానిఁ బొగడదనరువాని
దయతోడ [3]కూడి చేతనవాని తనవాని
తనయంతవానిగా నునుచువాని
[4][5]పదములు బొదలు నాపగ వాని పగవాని
పగవాని బురుకను బిరుదు వాని
నెమ్మోము నగవువెన్నెలవాని [6]నెల వాని
చెలి కన్నుదోయిగాఁ జెలగు వాని
నంబుదపు డంబుమీఱు గాత్రంబువాని
కొండనని కోర్కికొండను కొండవాని
నిలువుగల పైఁడిచెలువుల వలువవాని
మేలుసమకూర్చు నలమేలు మేలువాని.

179


సీ.

తల నిల్లుగట్టు వ్రతంబుల రాయని
తోమని పళ్యాల నేమగాని
[7]చేరుడుబియ్యాల యోరెముల్ దినువాని
కోణంగి సేవల నాణెగాని
కానుకలకు వడ్డికాసులు గొను[8]వాని
ముక్కోటితీర్థపు టెక్కులాని
అడుగడ్గునకు మొక్కు[9]లందుకొనెడువాని
కూకటి మాడల గుత్తవాని
శుక్రవారపు సేవల సొగసువాని
మానినుల గోరి వలపించు మాయలాని
తిండిమెండయగారిని [10]దిగళగురుని
కాంచి సేవించి సంతోషకలితులగుచు.

180
  1. ధేశు. తా. వేశు. పూ. ము.
  2. కఠారువు.
  3. కూడు. తా. పూ. ము.
  4. పదముల ....గాత్రంబువాని. ఈ భాగము పూర్వముద్రణమున లేదు.
  5. పదములు తా.
  6. నల. తా.
  7. వేరెడు. తా.
  8. రేని. తా. జేని. పూ. ము.
  9. లందెడి దేవుని. పూ. ము. తా.
  10. తిగళుగురుని. తా.