పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

81


సత్యలోకంబేలుసామి [1]కాల్యకరణీ
యనిదానకలశి పావనము సేసి
నిటలలోచన జటాపటలిఁ దెప్పలఁ దేల్చి
వర భగీరథ తపోవ్రతముకతన
ప్రాలేయశైలమార్గమున భూమికి జాఱి
కూరిమిఁ దనవారిఁ గ్రుంకు వారి
కలుషములడంగఁజేయు రంగత్తరంగ
త్రిజగతీకృత సుకృతవర్థిత నిజాంగ
గంగఁ జేరంగనరిగి సాష్టాంగ మెరఁగి
కూడి కొనియాడి మజ్జనంబాడి యాడి.

166


సీ.

జలదనీలశ్యాము శాంకరీస్తుతనాము
సకల దేవ సమూహసార్వభౌము
నీలాచలావాసు పాలితనిజదాసు
కటితటీవిస్ఫురత్కనకవాసు
నఖలలోకాధ్యక్షు నఘదంతిహర్యక్షు
కౌస్తుభశ్రీవత్సకలితవక్షు
[2]బృందారకోదారు నందగోపకుమారు
హార కిరీట కేయూర హారు
పల్లవీజారు రవిసుతావనవిహారు
శ్రీజగన్నాథు నాదిలక్ష్మీసనాథుఁ
గాంచి సేవించి పూజించి కడు నుతించి
హర్షపులకిత సర్వాంగు లగుచు మునులు.

167


గీ.

గంగకన్నను గడు వృద్ధగంగయనెడు
[3]వహిని వహియించు నా పుణ్యవాహినిఁ గని
వినుతులఁ జెలంగి తత్తీర్థమున మునింగి
మునివరేణ్యులు సమ్మోదమునను బొంగి.

168
  1. కాల్యకరణీయదానకలసి భావన సేసి. తా. ఈ భాగము పూర్వముద్రణమున లేదు.
  2. బృందారతోదారు. తా.
  3. వాహినివహించు. పూ. ము. తా.