పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

ఘటికాచలమాహాత్మ్యము


క.

ఘటికాద్రికరుగుఁ డచ్చట
ఘటికామాత్రమున మీకు కాంక్షితమెల్లన్
ఘటియిల్లు [1]నెంచఁదగునా
ఘటికాద్రికి మాద్రి యద్రి గలదే జగతిన్.

162


సీ.

అమరస్రవంతికి శమనదిగ్వీథిని
నూఱుయోజనములమేర నిగమ
విద్యావధూకాంచి విలసిల్లు నల కాంచి
[2]యల కాంచితంబయి యచట నశ్వ
మేధము జేయు వాణీధవు విశ్వను
తోత్తరవేది శ్రీయుక్తుఁడగుచు
.......................
.......................
.......................
.......................
నద్రిరాజంబు శ్రీఘటికాద్రి దనరు
నదిగదా నిత్యసదన మయ్యచ్యుతునకు.

163


గీ.

అందుఁజేసినతప మణువంతయైన
కోటిగుణితంబు ఫలియించు కోర్కెలెల్ల
నరుగుఁ డాశైలమున కను నభ్రవాణి
వాణి చెవులార విని మునిప్రవరు లపుడ.

184


గీ.

కదలి పుణ్యాశ్రమంబు లగణ్యపుణ్య
భూములును బుణ్యదేశము ల్పుణ్యనదులు
పుణ్యతీర్థములును పుణ్య[3]పురులు పుణ్య
శైలములు జూచుచు మునిచంద్రు లరిగి.

185


సీ.

ఆదిఁ ద్రివిక్రమపాదపంకేరుహో
దరభాగమున నవతార మొంది

  1. నేచతగు. తా.
  2. ఈ కడమ భాగము పూ. ము. లేదు. 164 వ పద్య మీ సీసమున కెత్తుగీతిగా ముద్రింపబడియున్నది.
  3. మునులు. పూ. ము. తా.