పుట:ఘటికాచలమాహాత్మ్యము (తెనాలి రామకృష్ణుడు).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

ఘటికాచలమాహాత్మ్యము


క.

ముందర నరుంధతిం గని
సౌందర్యముబూనుమేను చటుల తపోగ్నిన్
గందఁగ నున్నది వికృతిన్
జెందింపఁగఁ జాల దీ వసిష్ఠమునీంద్రున్.

153


మ.

మన యాటల్ మన పాటలున్ మన కళామర్మానుభావక్రియల్
పనిలే దిత్తఱి వాద మేటికిని నీపాటింక నెవ్వారలున్
గనకుండం జనకున్నఁగాదని పొసంగన్ రంభతోఁబల్కి వ
చ్చినజాడం జనిరందఱుంగదలి యా జేజేమిటారు ల్వెసన్.

154


క.

చని రచ్చర లిటు వీరల
కెన యెవ్వరు ధైర్యచర్య నిల నని మునులన్
గనుఁగొన వచ్చెననఁగ వే
గనుపట్టెన్వేగుజుక్క కాంతులు [1]నిక్కన్.

155


ఉ.

వేలుపు జవ్వనుల్ జనిరి వేకువ తేకువగూడ జూడగా
దాలిమి దూలి వీరు దయదప్పి యొకించుక కన్నువిచ్చినన్
జాల ప్రమాదమంచు రభ సంబున నంబుజవైరిజాఱెఁ బెన్
జాలిని నస్తకూటముల చాటున డాగగఁబోవుకైవడిన్.

156


క.

తుఱుమున దుఱిమిన మొల్లల
సరు లెడలి గగనలక్ష్మి సంపంగి విరుల్
దుఱిమెనొనా రిక్కల [2]సిరి
దఱుగన్ రవిరుచులుకొన్ని తఱిఁ దీండ్రించెన్.

157


సీ.

చీఁకటి మొదలిజేజేలపైఁ జను నింద్రు
[3]1క్రొంబట్టు తెలిగుడారంబనంగ
ఇనురాకఁ బ్రాగ్దిశావనజాక్షి కై[4]సేయ
పాటించు రత్నదర్పణమనంగ
ఉదయాచలమురారి హృదయభాగమ్మున
రాణించు కౌస్తుభరత్నమఁనగ

  1. నింకన్. తా.
  2. హరి. తా.
  3. కెంబట్టు తా.
  4. సేసి పూ.ము. తా.